Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'నవతెలంగాణ' ఎఫెక్ట్
- తక్షణమే తొలగించాలని ఆదేశాలు... నోటీసులు జారీ...
నవతెలంగాణ-నర్సంపేట
ఎస్సారెస్పీ కాల్వపై అ క్రమ నిర్మాణాలపై ఇంజనీ రు అధికారులు విచారణ చే పట్టారు.'యధేశ్ఛగా ఎస్సారె స్పీ కాల్వ కబ్జా' అనే కథనం 'నవతెలంగాణ' దిన పత్రిక లో ప్రచురితం కాగా సాగు నీటి పారుదల శాఖ ఇంజనీ రు అధికారులు స్పందించా రు. శుక్రవారం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు సాల్మన్, డీఈ సంతోష్, ఏఈ కిరణ్మయి కాల్వను సందర్శించారు. కాల్వ ప్రదేశాన్ని కొలతలను చేసి పలు రకాల అక్రమ నిర్మాణాలను నిర్థారించారు. వెంటనే కాల్వపై నిర్మాణా లను తొలగించాలని యాజమాని డాక్టర్ రాజారామ్‌కు చెప్పారు. కాల్వలను ఆక్ర మించడం చట్ట రీత్యా నేరమని, వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించడా నికి అనుమతులు తీసుకోవాలన్నారు.నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి తగు చర్యలు తీసుకుంటామని ఈఈ సాల్మన్ చెప్పారు. కాగా మండలంలోని రాములు నాయక్ తండ గ్రామ పంచాయతీ పరిధిలోని ఈ కట్టడాలకు ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని పంచాయతీ కార్యదర్శి చెప్పారు. ఈ మేరకు నోటీసులు జారీ చేశామన్నారు.