Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
కవల తల్లులకు కేసీఆర్ కిట్లను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంద జేశారు. శుక్రవారం జిల్లా ఆసుపత్రిలో దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన బొంత సారయ్య, సారమ్మ దంపతులకు కవల కూతురులు లలిత, రమా ఉ న్నారు. ఈ ఇద్దరి కవలలకు యేడాది క్రితం ఒకే రోజు వివాహం అయింది. గర్భిణీలు అయిన వీరిద్దరు ప్రసూతి కోసం చేరారు. వైద్యులు ప్రసూతి చేశాక ఈ ఇద్దరు కవల సోదరీలకు శుక్రవారం మగ పిల్లలు జన్మించారు.ఈ అరుదైన ప్రసవం వైనం తెలుసు కొని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆసుపత్రిని సందర్శించారు. వీరి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు. కేసీఆర్ కిట్లను అందజేసి కవల తల్లులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రసూతి చేసిన ఆసుపత్రి వైద్యులకు, సిబ్బందిని అభినందించారు.ఈ సం దర్భంగా జిల్లా ఆసుపత్రి సూపరిండెంటెండ్ డాక్టర్ పీ.గోపాల్, రైతు సమన్వయ సమి తి రాష్ట్ర డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, తిమ్మంపేట సర్పంచ్ మోడెం సాగర్, గ్రంధా లయ సంస్థ డైరెక్టర్ పుట్టపాక కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.