Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
చిన్న వయసు నుండే విప్లవోద్యమంలో అంచలంచెలుగా ఎదుగుతూ ఆదివా సి గిరిజన, బడుగు, బలహీన, పేద వర్గాల కోసం అలుపెరుగని పోరాటం చేసిన బేబక్క ఆశయాలను కొనసాగిద్దామని ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆగబోయిన నర్సక్క పిలుపు నిచ్చారు. శుక్రవారం మండల కేం ద్రంలోని న్యూడెమోక్రసీ పాలడుగుకృష్ణ స్మారక భవనంలో బేబక్క చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నర్స క్క మాట్లాడుతూ సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై, మద్యపానం సారా పోరాటాలను, వరకట్నం పేరుతో మహిళలపై జరుగుతున్న దాడులకు వ్య తిరేకంగా పోరాటాలు చేసి విప్లవ ప్రతిఘటన ఉద్యమంలో మహిళలకు పేద ప్రజ లకు అండగా నిలిచారని కొనియాడారు. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో అనేక నిర్బంధా లను ఎదుర్కొని దోపిడి పాలకవర్గ పార్టీలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానా లకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతంచేస్తూ ఆదివాసి గూడాలను, గుంపులు, తండాలను తిరుగుతూ వారికి బాసటగా నిలిచారన్నారు.తన తమ్ముడైన పాలడు గు కృష్ణ హత్యకు గురైన అదేమీ పట్టించుకోకుండా గుండె నిబ్బరంతో విప్లవద్య మంలో నడిచి పేద ప్రజలకు పోడు భూములను పంచిన చరిత్ర బేబక్కదన్నారు. అనంతరం మండల కేంద్రంలో బేబక్క సంతాప సభల కరపత్రాలను ప్రజలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు బూర్క బుచ్చి రాములు, యాదగిరి యుగంధర్, గట్టి సురేందర్, పసునూరి రాజమల్లు, శ్రీశైలం, పూర్ణచందర్, రామచంద్రు, రాజేందర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.