Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చెన్నారావుపేట
వ్యక్తిగతంగా నాకు ఒక్క కేసు కూడా లేదని, అ న్ని ఉద్యమంలో తెలంగాణ కొరకు కోట్లాడిన కేసులే అని, మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానానీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అమీ నాబాద్లో క్లస్టర్ ఇంచార్జి బుర్రి తిరుపతి అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమ్మేళనం సమావేశానికిముఖ్య అతి థిగా పాల్గొని మాట్లాడారు. మండల అభివవృద్ధిని అ డ్డుకున్నది ఆనాటి పాలకులేనని ప్రతి చోటా అడ్డంబ కులు సృష్టించి అసత్య ప్రసరాలు చేస్తున్నారాని మం డి పడ్డారు. వేసవి కాలంలో కూడా చెరువులు నుండి ఈ ప్రాంతమంతా పచ్చదనంతో కళకళలాడుతుందని దానికి గల కారణం కేసీఆర్ పాలనని మనం గర్వం గా చెప్పుకోవాలన్నారు. తండాలకు, గ్రామాలకు సిసి రోడ్లు, బీటీ రోడ్లు నిర్మాణం చేపట్టి ఎక్కడ లేని అభి వృద్ధి చేపట్టానన్నారు. పంట నష్టపరిహారం పార్టీలక తీతంగా ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి అందిస్తున్నామ నీ, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన మళ్లీ రానున్నది మన ప్రభుత్వమే మిగిలిన పనులను సకాలంలో పూ ర్తి చేసుకొని, మరోసారి నర్సంపేట గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని, నాయకులు, కార్యకర్త లు నాకు కుటుంబ సభ్యులతో సమానం. వారిపై నా కున్న ప్రేమ, ఆప్యాయత, వారితో నాకున్న అనుబం ధం విడదియ్యరానిదనీ నిత్యం ప్రజల్లో ఉంటూ, క్రమ శిక్షణ కలిగిన నాయకులకు గులాబీ జెండా అన్నివేల అండగా ఉంటుంది. ఆత్మీయ సమ్మేళనం మన భవి ష్యత్తు కార్యచరణకు దిశానిర్దేశం చేస్తూ అందరిలో స్ఫూర్తి నింపుతుందని ఆశిస్తున్నానన్నారు. ఈ కార్య క్రమంలో జడ్పిటిసి పత్తి నాయక్, ఎంపీపీ బాదావత్ విజేందర్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండి రఫీ, ఎంఏ గప్పార్, పిఎసిఎస్ చైర్మన్లు ముద్దసాని సత్యనారా యణ రెడ్డి, మురహరి రవి, క్లస్టర్ బాధ్యులు బాల్నే వెంకన్న, జున్ను తల రాంరెడ్డి, జక్క అశోక్ యాదవ్, చెన్నారెడ్డి, తోటి శ్రీనివాస్ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.