Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
ఆరోగ్య మహిళ వైద్య శిబిరాల ను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య సూ చించారు. శుక్రవారం డివిజన్ కేం ద్రంలోని సామాజిక ఉన్నత శ్రేణి ఆసుపత్రిని, చాగల్ గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య మహిళా వైద్య శిబిరాల నిర్వహణపై సంబంధిత వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఇబ్బం దులు లేకుండా జరుగుతుందని, ఇప్పటివరకు వైద్య పరీక్షలు నిర్వహించి అవస రం ఉన్నవారికి కంటి అద్దాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. క్యాంపుల పరిధిలో ఉన్న వారందరికీ సమాచారం అందించి కంటి వెలుగు వైద్య పరీక్షలకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు, ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది వివరాలు, ల్యాబ్ టెస్టులు, ఇన్ పేషెంట్, ఔట్ పేషంట్, మందుల పంపిణీ, తది తర అంశాలపై అరా తీశారు. వైద్య పరీక్షలకు ఆసుపత్రికి వచ్చే ప్రజలకు వైద్యం అందించి ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఆడవారికి రక్తహీనత, చిన్న పిల్లలకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఈ వైద్య పరీక్షల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. వైద్య పరీక్షలలో అవసరం ఉన్నవారిని జిల్లా ఆసుపత్రికి పంపించి, మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.ఈకార్యక్రమంలోఇన్చార్జి జిల్లావైద్యాధికారి డా.రవీందర్, డిప్యూ టీ డీఎంహెచ్ఓ సుధీర్ కుమార్, సంధ్యారాణి, భాస్కర్, రాజశేఖర్, పాల్గొన్నారు.