Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు,వారి తల్లదండ్రులకు వచ్చిన సందేహాలను నివృత్తి చేయు టకు ఫోన్ ఇన్ ప్రోగ్రాం చాలా ఉపయోగ పడుతుం దని వరంగల్ జిల్లా విద్యశాఖ అధికారి వాసంతి అ న్నారు. వరంగల్ జిల్లా కార్యాలయంలో విద్యాశాఖ అధికారి అధ్వర్యంలో శుక్రవారం ఫోన్ ఇన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ నెల 3 నుండి 12 వరకు నిర్వ హించే పదవతరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యా ర్థిని విద్యార్థులకు జిల్లాలోని వివిధ మండలాల నుం చి ఇతర జిల్లా నుంచి కూడా విద్యార్థిని, విద్యార్థులు తల్లిదండ్రులు సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
పి.నవ్య, జిహెచ్ఎస్ గ్రెన్ మార్కెట్, వరంగల్
పరీక్షలు అంటే భయంగా ఉంది?
డి.ఇ.ఓ : భయపడవలసిన పనిలేదు ఒక గంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకొని ధైర్యంగా పరీ క్షలు రాయండి.
శ్రీకాంత్, పరకాల, హనుమకొండ జిల్లా
పాఠశాల హెడ్మాస్టర్ ద్వారా తీసుకున్న హాల్ టికెట్ తోటే పరీక్షకు అనుమతిస్తారా లేదా ఇంటర్నెట్ ద్వారా తీసుకున్న హాల్ టికెట్‌ను అనుమతి స్తారా?
డిఇఓ : హెచ్ఎం ద్వారా హాల్ టికెట్ తీసుకోక పోయినా ఇంటర్నెట్ ద్వారా తీసుకున్నటువంటి హాల్ టికెట్‌తో పరీక్షకు హాజరు కావచ్చు.
కొండా హాసిని, పెరుకవెడు, రాయపర్తి
పరీక్షా కేంద్రానికి హాజరు కావడానికి ఆర్టీసీ బస్సులో అనుమతిస్తారా?
డిఇఓ : హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు
చైతన్యశ్రీ జీహెచ్ఎస్ నరేంద్రనగర్, వరంగల్
గణిత పరీక్ష రోజు రఫ్‌వర్క్ చేసుకోవడానికి అద నంగా జవాబు పత్రాలు ఇస్తారా?
డిఇఓ : అన్ని పరీక్షలకు అదనపు పత్రాలు ఎన్నై నా ఇస్తారు. వాటన్నింటినీ జవాబు పత్రాలతో కలిపి జతచేసి ఇవ్వవలసి ఉంటుంది.
సీహెచ్ రాజేష్, పర్వతగిరి
భౌతిక రసాయన శాస్త్రం, జీవశాస్త్రం పరీక్షలు ఒకేరోజు నిర్వహించడం వలన మాకు ఇబ్బందికరం గా ఉంటుంది రెండు రోజులు నిర్వహించగలరా ?
డిఇఓ : ఇప్పుడు సాధ్యపడదు. ఈ పరీక్షలు ఇచ్చి న నిబంధనల ప్రకారమే ఒకే రోజు రాయవలసి ఉం టుంది పరీక్షా కేంద్రంలో మీ ఇన్విజిలేటర్ సూచనలు మేరకు ఎలాంటి ఆందోళన చెందకుండా భౌతిక శా స్త్రము, జీవశాస్త్రము పరీక్ష వేరువేరుగా ఒకే రోజు రా యవలసి ఉంటుంది
మీ సందేహాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము
అంతరం ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డీఈవో వరంగల్ మాట్లాడుతూ విద్యార్థు లందరూ ఇచ్చిన సమయం కంటే ఒక గంట ముందు గానే పరీక్షా కేంద్రానికి చేరుకొని ఏలాంటి ఆందోళన లు, భయం లేకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని జిల్లాలో గల పరీక్షా కేంద్రాలలో ప్రభుత్వ ఆదేశాల మే రకు అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా ప్రకటించారు.
విద్యార్థులందరూ 100 శాతం ఫలితాలు సాధించి ఎక్కువ మొత్తంలో 10/10 జీపీఏ సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని, విద్యార్థులను వారి తల్లిదండ్రులు పిల్లలందరినీ ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిసిఈబి వరంగల్ జిల్లా సెక్రెటరీ కే.మూర్తి, ఏసీజీ డీసీపీ నరసింహారావు, శ్రీధర్ పాల్గొన్నారు.