Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రగతిని సమీక్షించిన మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ ఇంచార్జ్ కమిషనర్ ప్రావీణ్య
నవతెలంగాణ-వరంగల్
గ్రేటర్ వరంగల్ పరిధిలో స్మార్ట్ సిటీ పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి, కలె క్టర్ ఇన్చార్జి జీడబ్ల్యుఎంసీ కమిషనర్ ప్రావిణ్యలు ఆదేశించారు. శుక్రవారం జీడ బ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో బల్దియా ఇరిగేషన్, విద్యుత్, కుడా అధికారు లు గుత్తేదారులతో వారునగరంలో స్మార్ట్ సిటీ పథకం కింద కొనసాగుతున్న పను లపై సమీక్షించి నాణ్యతతో సకాలంలో పూర్తి చేయుటకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్మార్ట్ సిటీ పథకం కింద 948.55 కోట్ల రూపాయలతో 66 అభివృద్ధి పనులను చేపట్టగా అందులో ఇప్పటికే 27 పనులు పూర్తైనాయని, మిగిలిన వివిధ పురోగ దశలలో కొనసాగుతున్న 39 పనులను త్వ రితగతిన పూర్తి చేయాలన్నారు.ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, వడ్డేపల్లి బండ్ అభివృద్ధి పనులు, భద్రకాళి బండ్ జోన్ డీ జోన్ ఈ పనుల పురోగతి, 5 గ్రాండ్ ఎంట్రెన్స్‌లు, ఉర్స్ గుట్ట బండ్ అభివృద్ధి, ఎఫ్ఎస్టీపీ, ఎస్టీపీలు, ట్రాన్స్ఫర్ స్టేషన్లు, ల్యాండ్రో మార్ట్లు, ఆర్1, నుండి ఆర్10 స్మార్ట్ సిటీ రోడ్లు, ఆర్ఇసీ నుండి కేయుసీ రోడ్డు వరకు, ఊర చెరువు గోపాల్పూర్ నుండి ప్రెసిడెంట్ పాఠ శాల వరకు అండర్ గ్రౌండ్ డక్ట్ పనులు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, తదితర కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని కూలంకషంగా సమీ క్షించి, వేగవంతంగా పూర్తి అయ్యేలా సంబంధిత అధికారులు నిత్యం పర్యవేక్షించా లన్నారు. నాలలపై కల్వర్టుల ఏర్పాటు, రోడ్ల విస్తరణ పనులలో ఏమైనా అవరోధా లు ఏర్పడినచో పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో పరిష్కరించాలన్నా రు. కాంట్రాక్టర్లకు పెండింగ్‌లో లేకుండా బిల్లులు చెల్లిస్తున్నామని, మెన్ అండ్ మెటీ రియల్ను పెంచి నిర్ణిత గడువులోగా పనులు పూర్తి చేయాలని, లేనిచో కాంట్రాక్టర్ల బిల్లులలో కోత విధించడం జరుగుతుందన్నారు. లైబ్రరీల నవీకరణలో భాగంగా ప్రస్తుతం పోటీ పరీక్షలకు విద్యార్థులు సిద్దమవుతున్న నేపథ్యంలో వారి సౌకర్యా ర్ధం ప్రాంతీయ, సెంట్రల్ లైబ్రరీలలో ఇ-బుక్స్, ఆర్ఎఫ్ఐడి ట్యాగ్‌లతో అందు బాటులోకి వెంటనే తీసుకువచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు.ఈ సమీక్షలో బల్దియా ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, స్మార్ట్ సిటీ పీఎంసి ఆనంద్ ఓలేటి, సిటీ ప్లానర్ వెంకన్న, సిహెచ్ ఓ శ్రీనివాసరావు, ఈఈలు రాజయ్య సంజయ్ కుమార్, కుడా ఈఈ భీం రావు తదితరులు పాల్గొన్నారు.