Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
పంటనష్ట నివేదికలను పక్కాగా రూపొందించా లని, 3 రోజులలో తప్పనిసరిగా అందించాలని జిల్లా కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. శుక్రవా రం ఐ.డి.ఓ.సి. సమావేశ మందిరంలో పంట నష్ట నివేదికలను రూపొందించడంలో అదనపు కలెక్టర్‌తో కలిసి వ్యవసాయ శాఖ సంబంధిత అధికారులకు అ వగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 9,100 మంది రై తులకు సంబంధించి 21,408 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు ప్రాధమికంగా గుర్తించామన్నారు. పంట నష్ట నివేదికలను వాస్తవాలతో రూపొందించేం దుకు వ్యవసాయ శాఖలోని 85 క్లస్టర్లలో 27 క్లస్టర్ లలో పంటనష్టం జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని, క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతు వివరాలు సమగ్రం గా సేకరించి నివేదికకు జతపరచి సమర్పించాలన్నా రు. ఎంపిడివోలు, తహసీల్దార్లు ప్రతిరోజు రూపొం దించిన నివేదికలు అందించాలన్నారు. పంట నష్టం నివేదిక రూపొందించడంలో వ్యవసాయ సంబంధిత అధికారులు నిబద్ధతతో పనిచేయాలని, నష్టపోయిన రైతుకు న్యాయం చేయాలని ఎకరానికి 10వేలు నష్ట పరిహారం ప్రభుత్వ ప్రకటించినందున నివేధికలలో పారదర్శకత లోపిస్తే చర్యలు తీసుకుంటామని, ఇతర అధికారులతో తనిఖీ చెపిస్తామన్నారు. పంట నష్టం నివేదిక రూపొందించేటప్పుడు రైతుల నుండి ఫిర్యా దులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో తొర్రుర్, పెదవంగర, నెల్లికుదురు, దంతాలపల్లి, కేస ముద్రం మండలాలలో పంట నష్టం ఎక్కువగా ఉంద న్నారు. వ్యవసాయ శాఖ అధికారులందరు పంట న ష్టం నివేధిక నమోదు కార్యక్రమంలో పాల్గొనాలన్నా రు. పంటనష్టం నివేధికలో రైతు బ్యాంక్ ఖాతా నెం బర్తో పాటు, ఆధార్ నెంబర్ నమోదు చేయాలన్నా రు.కలెక్టర్ కార్యాలయంలో సమాచారంకొరకు సిపిఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్ 96036 07910 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ స మావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, ట్రైనీ కలెక్టర్ పింకేశ్ కుమార్, ఆర్డీఓ కొమరయ్య, సిపిఓ సుబ్బా రావు,వ్యవసాయ శాఖ అధికారి చత్రు నాయక్, ఉద్యా న శాఖ అధికారి సూర్యనారాయణ,పశుసంవర్ధక శాఖ అధికారి సుధాకర్, మత్స్య శాఖ అధికారి నాగమణి, సహకార శాఖ అధికారి ఖుర్షీద్ వ్యవసాయ అధికారు లు తదితరులు పాల్గొన్నారు.