Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపాలిటీ ముందు సీపీఎం ధర్నా - మేనేజర్‌కు వినతి పత్రం అందజేత
నవతెలంగాణ-మమబూబాబాద్
మహబూబాబాద్ పట్టణంలోని త్రాగునీరు సమస్య ఉన్న అన్ని కాలనీలకు త్రాగునీరు అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సుర్ణపు సోమయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో త్రా గునీరు సమస్య ఉన్న అన్ని కాలనీలకు త్రాగునీరు అందించాలని మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి మేనేజర్‌కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సంద ర్భంగా సుర్ణపు సోమయ్య మాట్లాడారు. నాలుగో వార్డ్ ఇల్లందు రోడ్డులోని నున్న నారాయణనగర్ కాలనీ, జ్యోతిబస్నగర్ కాలనీలలో పేదలు ఇల్లు కట్టుకొని పది పదిహేను సంవత్సరాల నుండి నివసిస్తున్నారని, పాలకుల అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రతి సంవత్సరం వేసవి కాలంలో నీటి సమస్య సంవత్సర సంవత్సరంనకు పెరుగుతుందే తప్ప సమస్య పరిష్కారం కాలేదని విమర్శించారు. టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల సందర్భంలో తెలంగాణలో మాప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ పైప్ లైన్లు వేసి ప్రతి ఇంటికి నల్ల కలెక్షన్ ఇస్తానని త్రాగునీరు అందిస్తానని ప్రజ లకు ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలు కాలేదని దుయ్యబట్టారు. సీపీఎం పట్టణ కమిటీ త్రాగునీరు కోసం ఎన్నోసార్లు పోరాటాలు ఆమరణ నిరాహార దీక్షలు చేసిం దని,పాలకవర్గాలు కొంత ఉపశమనం చేసిన శాశ్వత పరిష్కారం చేయలేదని విమ ర్శించారు. ఒక సంవత్సరం క్రితం నున్న నారాయణకాలనీ, జ్యోతిబస్నగర్ కాలనీ లో మిషన్ భగీరథ పైప్ లైన్లు వేశారని, తాగునీరు ఈ వేసవి కాలంలోనన్న అంది స్తారని ప్రజలు సంతోషపడ్డారు.కానీ పాలకులు అధికారులు కాలనీ ప్రజలకు నీరు అందించే దానిలో నిర్లక్ష్యంగా ఉన్నారని అన్నారు. తక్షణమే మిషన్ భగీరథ పైపుల ద్వారా గాని, బోర్ల ద్వారా గాని, ట్యాంకర్ల ద్వారా గాని త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. లేనిఎడల పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ఆందోళన పోరా టాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సమ్మెట రాజమౌళి, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పాల బిందెల మల్ల య్య, కుడి కంటి అనిత, జంగా కళావతి, ఎస్.కె రెహనా, బొజ్జ మంగమ్మ, తంగేళ్ల పల్లి హైమావతి, ఎస్కే అలీమా,తోటకూర సారమ్మ,తూల రమ,బూష్పాక ప్రియాం క, వీణపల్లి కవిత, సుర్ణపు మమత, గొడుగు అనూష, తోట పుష్ప, ఎస్కే మైరుణి స, కనకమ అనంతలక్ష్మి, సరోజ, మత్స వెంకన్న తదితరులు పాల్గొన్నారు.