Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ములుగు
ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ బిల్లును పార్లమెం టులో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఎంఎస్పి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాల యాన్ని ముట్టడించారు. ఈ కార్యక్రమం మహాజన సోషలిస్ట్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ జన్ను రవి మాదిగ,ఎంఎస్పీ పార్టీ ములుగు టౌన్ అధ్య క్షుడు మరాఠీ రవీందర్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా జిల్లా ఇన్చార్జి ఇరుగు పైడి మాదిగ హాజరై మాట్లాడారు. బీజేపీ కేంద్రంలో అధికారం లోకి వస్తే 100 రోజులలో వర్గీకరణచేస్తామని మోడి చెప్పి నేడు ఎనిమిది సంవత్సరాలైనా ప ట్టించుకోవట్లేదన్నారు. ప్రస్తుత పార్లమెంటు స మావేశాలలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ బిల్లు ప్రవే శపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నెమలి నరసయ్య, వావిలాల స్వామి,ఎమ్మెస్సీ పార్టీ ములుగు జిల్లా నాయకులు మడిపల్లి శ్యాంబాబు, ఎంఎస్పి జిల్లా సీనియర్ నేత, ఎంఎస్పి ములుగు జిల్లా నాయకులు నద్దునూరి రమేష్, వావిలాల సాంబశివరావు, డప్పు కళాకారుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.