Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శాయంపేట
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలు చేయడం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కల్లపల్లి శ్రీనివాస రావు ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ హామీల అమలుకై మార్చి 25న ప్రారంభమైన సీపీిఐ ప్రజా పోరు యాత్ర శుక్రవారం మండలంలోని మాందారిపేట గుట్టల వద్దకు రాగా మండల నాయకులు బత్తిని సదానందం, అనుకారి అశోక్, అరికిల్ల దేవయ్య, మారపల్లి క్రాంతి కుమార్, గుడిసె వాసులు స్వాగతం పలికారు. అక్కడి నుండి డప్పు చప్పులతో శాయంపేట అంబేద్కర్ కూడలి వరకు యాత్ర కొనసాగింది. అంబేద్కర్ విగ్రహానికి, అనుకారి దామోదర్ స్తూపానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, కాజీపే టలో రైల్వే పరిశ్రమ, ములుగులో గిరిజన విశ్వవిద్యాల యం ఏర్పాటు చేస్తామని పార్లమెంటులో ఆమోదించగా, 2014లో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాన్ని తుంగలో తొక్కిందన్నారు. పరిశ్రమల, విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. తెలంగాణ ఎంపీలు కూడా వైఫ ల్యం చెందారని మండిపడ్డారు. ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వ స్థలాలు ఇవ్వాలని సిపిఐ భూపోరాటాలు చే స్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చి 9 ఏళ్ల గడిచినప్పటికీ ఏ ఒక్కరికి ఇల్లు కేటాయించలేదని మండి పడ్డారు. జీవో 58 ప్రకారం 125 గజాల స్థలం ఉచి తంగా పంపిణీ చేస్తానని ప్రకటించి విస్మరించారన్నారు. వామపక్షాల ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములను ఆక్ర మించి నిరుపేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు. భూ ములు దక్కేవరకు విశ్రమించేది లేదని, ఉద్యమం ఆగేది లేదని స్పష్టం చేశారు. పదవులు, స్వార్థం కోసం కొందరు పాదయాత్రలు చేస్తున్నారని, వామపక్షాలు మాత్రం జనాన్ని చైతన్యవంతం చేయడానికి ప్రజా పోరు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోడు భూముల రైతులకు పట్టాలు ఇవ్వాలని, నిరుపేదలకు ఇండ్ల పట్టాలి ఇవ్వాలని, గనుల ప్రైవేటీకరణ నిలిపివేసి సింగరేణి ఆధ్వర్యంలో మైనింగ్ నిర్వహించాలని, హైదరాబాద్ నుండి జనగామ వరకు ఇండిస్టియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హనుమకొండ లో ఏప్రిల్ నెల 5న బహిరంగ సభతో పౌరుయాత్ర ముగుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యదర్శులు విజయ సారధి రెడ్డి, కర్రే బిక్షపతి, తోట బిక్షపతి, కొరిమి రాజ్ కుమార్, నేదునూరి జ్యోతి, ఎన్ఎస్ స్టాలిన్, మంద సదాలక్ష్మి, జన సేవాదళ్ రాష్ట్ర కన్వీనర్ ముంజాల రమేష్ పాల్గొన్నారు.