Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'నవతెలంగాణ' ఎఫెక్ట్
నవతెలంగాణ-మట్టెవాడ
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో మిఠాయి దుకాణంలో పాడైపోయిన కేకులు, మి ఠాయి పదార్థాలు, పాడైపోయిన పండ్ల నుండి రసా లుతీసి అమ్ముతూ వినియోగదారులను దోచుకుంటు న్న దుకాణం యజమానిపై బల్దియా అధికారులు కొరడా ఝులిపించారు. మరెవరైనా నాసిరకం కాలం చెల్లిన ఆహార పదార్థాలు వినియోగదారులకు అంట కట్టితే భారీమొత్తంలో జరిమానా విధిస్తామనే సందే శాన్ని గ్రేటర్ నగరంలోని దుకాణం దారులకు హెచ్చ రించారు. కేఎంసీ ఎదురుగా ఉన్న బాలాజీ శివ నారా యణ మిఠాయి ఘర్ దుకాణంలో కొత్త వాడకు చెంది న వినియోగదారులు పుట్టినరోజు కోసం కూల్ కేక్ ను కొనుగోలు చేసి ఇంటికి తీసుకవెళ్లి కట్ చేయగా లోపల ఫంగస్పట్టి కుళ్లిపోయి కంపు కొడుతున్న కేకు కనిపించడంతో అవక్కైన వినియోగదారుడు తిరిగి షాపువద్దకు వెళ్లి కేకు పరిస్థితిపై యజమానిని ప్రశ్నిం చిగ మేము ఇవే అమ్ముతాం ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని, కేసులుపెట్టుకోమని దబాయించారు. దీనిపై వినియోగదారుడు బల్దియా జవన్, శానిటేషన్ సిబ్బందికి చెప్పినప్పటికీ వారు స్పందించక పోవడం తో 'నవ తెలంగాణ'ను వినియోగదారులు ఆశ్రయిం చారు. వినియోగదారులతో కలిసి వెళ్లి 'నవతెలం గాణ' ప్రశ్నించగా అదే మొండి సమాధానం షాపు యజమాని నుండి వచ్చింది. దీంతో మిఠాయి దుకా ణంలో అమ్ముతున్న ఆహారపదార్థాలని ఫోటోలు తీసి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ మెడికల్ అధికారి జ్ఞానేశ్వర్ మొబైల్ వాట్సప్ నంబర్ కి మెసే జ్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఆ మెసేజ్ ప లు గ్రూపుల్లోచక్కర్లు కొట్టడంతో వెంటనే స్పందించిన సీఎమ్ఓ మున్సిపల్ సానిటేషన్ ఇన్స్పెక్టర్ సంపత్ రెడ్డి, సానిటేషన్ సూపర్వైజర్ సాంబయ్య , జవాన్లను మిఠాయి దుకాణం వద్దకు పంపించగా, బల్దియ సిబ్బంది వచ్చి దుకాణంలో తనిఖీలు చేయగా కాలం చెల్లి పాడైపోయిన వస్తువులు, పాడైన ఆహార పదా ర్థాలు అమ్ముతున్న విషయం నిజమేనని తేలడంతో రూ.10వేల జరిమానాను విధించారు. మళ్లీ ఇటు వంటి తప్పు పునరావత్తం అవుతే చర్యలు కఠినంగా ఉం టాయని హెచ్చరించారు.
పాడైపోయిన ఆహార పదార్థాలు విక్రయిస్తే చర్యలు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పాడైపోయిన, కాలంచెల్లిన ఆహార పదార్థాలు అమ్మి తే చర్యలు కఠినంగా ఉంటాయని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ హెల్త్ ఆఫీసర్ జ్ఞానేశ్వర్ దుకాణందారులకు హెచ్చరించారు. గ్రేటర్ వరంగల్ నగరంలో హౌటల్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తామని, నవ తెలంగాణకు వివరణ ఇచ్చారు.