Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లబెల్లి
మండల కేంద్రంలోని ఎ స్సారెస్పీ కెనాల్ కబ్జా జరుగు తున్నా అధికారులు పట్టించుకో కుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఎస్సా రెస్పీ కెనాల్కాల్వ స్థలాలను ఎ క్కడికక్కడ కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలు చేసి సొంతానికి ఉ పయోగించుకుంటున్నా కాల్వస్థలాలను పరిశీలించే అధికారి లేకపోవడం విడ్డూ రం అని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని వచ్చిన కథనాలకు స్పందించిన అధికారులు అక్రమ నిర్మాణాలు చేపట్టొద్దని నోటీసులు అందించినప్పటికీ అదే వ్యక్తులు తిరిగి పునర్నిర్మాణం, కొత్త భవనాలు నిర్మించడానికి పునాదులుతీసి ఎస్సారెస్పీ కెనాల్ ప్రాంతంలో నిర్మాణా లు చేపట్టడం జరుగుతుంది. అధికారుల దష్టికి తీసుకొచ్చిన చూసి చూడనట్లు వ దిలేయడం చర్చనీయాంశంగా మారింది. ఎస్సారెస్పీ కెనాల్ జాగల అక్రమాల వె నుక పెద్ద నాయకుల ప్రమేయం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.