Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎం నాయకులు మంద సంపత్
నవతెలంగాణ-హన్మకొండ
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలోని ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించా లని సీపీఎం హన్మకొండ సౌత్ మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం అదాలత్ అమరవీరులస్థూపం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా హాజరైన సీపీఎం హన్మకొండ జిల్లా కమిటీ సభ్యులు, సౌత్ మండల కా ర్యదర్శి మంద సంపత్ మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 ఏళ్లలో పేద, మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపుతూ పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తుదన్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఔశాదాలు పై 12 శాతం, రవాణా టోల్స్పై 5 శాతం, డిజిటల్ లావాదేవీలపై 1.1 శాతం పన్ను భా రం మోపిందన్నారు. అనారోగ్య పాలైతే ఆరోగ్యం కోసం వాడే జ్వరం ,బీపీ ,చర్మ వ్యాధులు, ఎనీమియా, పెన్ కిల్లర్, ఆంటీబయాటిక్స్ తదితర 800 రకాలకు పై గా ఉపయోగించే ఔషధాల ధరలను పెంచడం సరికాదన్నారు. అన్ని రకాల వాహ నాలు టోల్ ప్లాజా ద్వారా వెళుతూ వస్తున్న సమయంలో టోల్ పన్ను పెంచడం, అలాగే డిజిటల్ చెల్లింపులపైన పన్నులు పెంచడం దుర్మార్గమని వెంటనే ఈ పను లను విరమింప చేసుకోవాలని ఒక ప్రకటనలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. ఈ భారాలు సరిపోవు అన్నట్లు ఏప్రిల్ 1 తేదీ నుండి ప్రజలు అనారోగ్యాల పాలైతే ఆరోగ్యంగా ఉండడం కోసం వాడుకునే ఔషధాల (మందులు) పైన 12 శాతం పన్నులు అలాగే రోడ్లు నిర్మించినందుకు తిరిగి రావలసిన పెట్టుబడిని లాభంతో సహా కాంట్రాక్టరు రాబట్టుకోవడానికి టోల్ పన్నులను వసూలు చేస్తున్నారు టోలు చార్జీలు 5శాతం పెంచడం యూపీఐ ద్వారా ఫోన్ పే గూగుల్ పే ఒక రోజుకు 2000 రూపాయల ట్రాన్సాక్షన్ మించితే 1.1 శాతం పన్నులు వే యడం పేద,మధ్యతరగతి ప్రజలపై అడ్డగోలుగా భారాలు మోపడం అన్యా యం అన్నారు. ప్రజలు ఈ భారాల నుండి విముక్తి జరగాలంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంను వచ్చేఎన్నికల్లో ఓడించి తగిన గుణపాఠం అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు అలకుంట్ల యకయ్య, దూడపాక రాజేందర్, నోముల కిషోర్,ఎన్నాం వెంకటేశ్వర్లు, కంచర్ల కుమరస్వామి, పల్లకొండ శ్రీకాంత్, మనోహర్, రమేష్, రాజు, చందర్, శ్వేతా, సుకర్ణ, రాణి, మురళి, చా మంతి, రాంఖి, విజరు, భారతి, తదితరులు పాల్గొన్నారు.