Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్కతుర్తి
తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో బీజేపీ ప్రభుత్వం, ప్రధాన మంత్రి మోడీ విఫలమయ్యారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. శనివారం ప్రజా పోరు యాత్రలో భాగంగా బావుపేట, దండేపల్లి, సూరారం, ఎల్కతుర్తి ,గోపాల్పూర్ గ్రామాల్లో నిర్వహించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పునర్విభజనలో భాగంగా ఇచ్చిన హామీలన్నీ మోడీ తుంగలో తొక్కారని ఎద్దేవ చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాలేశ్వరం జాతీయ హౌదా ,ఇచ్చిన హామీలన్నీ ఏవి అమలు కాలేదన్నారు. అదేవిధంగా రూ.60లు ఉన్న పెట్రోల్ ధర రూ.110లకు, రూ.50లకు ఉన్న డీజిల్ రూ.100లకు, రూ.450లు ఉన్న గ్యాస్ సిలిండర్ ధరరూ.1200లకు పెంచిన ఘనత మోడీకి దక్కుందన్నారు. అదేవిధం గా పెట్రోల్ డీజిల్ ధరల పెంపువల్ల నిత్యవసర వస్తువుల ధరలు కూడా పెరిగి, సామాన్య ప్రజానీకానికి తీరనినష్టం వాటిల్లుతుందన్నారు.బిజెపి ప్రభుత్వ వైఫల్యా లపై, వామపక్ష పార్టీలు, ఇంకా లౌకిక పార్టీలను కలుపుకొని ఇంటింటికి వెళ్లి ప్రజ లను చైతన్యపరిచేందుకే, ఈ ప్రజా పోరు యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొ న్నారు. మోడీ గద్దె దిగేంతవరకు వాపక్ష పార్టీల ప్రజాపోరు యాత్ర ఆగబోదన న్నారు. అదేవిధంగా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు దక్కేంతవరకు , జరుగు తుందన్నారు. గిరిజనులకు పోడు భూముల పట్టాలిచ్చేంత వరకు ఉద్యమం ఆగద న్నారు. అనంతరం మండల కేంద్రంలో డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు, జిల్లా స హాయ కార్యదర్శి కర్రే బిక్షపతి, మండల కార్యదర్శి ఉట్కూరి రాములు, సహాయ కా ర్యదర్శి వెంకటరమణ, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కర్రి లక్ష్మణ్, నాయకులు, జ్యోతి, మనోహర్, ముండయ్య తదితరులు పాల్గొన్నారు.