Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ గుండు సుధారాణి
నవతెలంగాణ-వరంగల్
భద్రకాళి బండ్ పోతానానగర్ అభివృద్ధి పనుల ను వేగవంతంగా పూర్తిచేయాలని నగర మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు.భద్రకాళి బండ్ ఫ్రం ట్ సైడ్ ప్రోమేడ్ ఫోర్ షోర్లో కొనసాగుతున్న అభి వృద్ధి పనులను శనివారం క్షేత్రస్థాయిలోపర్యటించి ప నుల పురోగతి పరిశీలించారు. గ్రానైట్ ఫ్లోరింగ్, ప్ర ధాన ముఖద్వారం, శిల్ప సుందరికరణ, మార్గం తది తర పనులను పరిశీలించి గడువులోగా పూర్తి చేయాన్నారు. రామన్నపేట, సమీప ప్రాంతాలు భవి ష్యత్తులో వరద నీటితో ముంపునకు గురి కాకుండా ప్రస్తుతం ఉన్న పోతన మురుగుకాలువకు సమాంత రంగా మరొక డ్రైన్ నిర్మించుటకు చర్యలు తీసుకోవా లని తెలిపారు.పోతన విజ్ఞానపీఠం వద్ద డ్రైన్ వెడల్పు తక్కువగా ఉన్నందున వరద నీటి ప్రవాహం సాఫీగా జరుగుటకు వెడల్పు చేయుటకు ఇంజినీరింగ్, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈ ఈ ఆంజ నేయులు, బల్దియా ఈఈ రాజయ్య, ఇరిగేషన్ రిటైర్డ్ ఈఎన్సి విజరు ప్రకాష్,స్మార్ట్ సిటీ ప్రతినిధి ఆనంద్ ఓలేటి, ఇరిగేషన్ డిఈలు హర్షవర్ధన్, మధుసూ ద న్, బల్దియా డిఈ రవికుమార్, ఏఈ కార్తీక్ రెడ్డి, త దితరులు పాల్గొన్నారు.