Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ జిల్లా డీఈఓ వాసంతి
నవతెలంగాణ-వరంగల్
పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధంచేశామనివరం గ ల్ జిల్లా విద్యాశాఖ అధికారి వా సంతి అన్నారు. వరంగల్ జిల్లా విద్యాశాఖ కార్యాలయం లో శనివారం విలేకరుల సమావే శంలో డీఈవో మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో 293 పాఠశాల నుండి 56 పరీక్ష కేంద్రాల్లో 9728 మంది రె గ్యులర్ విద్యార్తులలో బాలురు 5013, బాలికలు 4715, ప్రైవేటు అభ్యర్థులు 27 మంది హాజరుకానున్నారు. హాల్ టికెట్స్, నామినేర్ రూల్స్ సంబంధిత పాఠశా లకు పంపడం జరిగిందన్నారు.ఈనెల 3 నుండి 12 వరకు పదో తరగతి పరీక్షలు ఉంటాయని పరీక్షలకు ఉదయం 9 గంటల నుండి 12:30 గంటల వరకు పరీ క్షల సమయం అని తెలిపారు. పరీక్ష కేంద్రానికి 8:15గంటలోపు రావాలని, 9: 35 తరువాత అనుమతి లభించని పరీక్ష కేంద్రం చుట్టూ 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్ష సమయం పూర్తి అయ్యేవరకు జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని తెలిపారు. పదవ తరగతి విద్యార్థులు ఒక్కరోజు ముందే పరీక్ష కేంద్రా న్ని ఖచ్ఛితంగా తెలుసుకోవాలని విద్యార్థులకు సూచించారు. సరిపడా బ్లూపెన్, బ్లాక్పెన్, రబ్బర్, స్కేలు తీసుకొని రావాలి. ఇన్విజిలేటర్ తమకు మెయిన్ ఆన్సర్ బుక్కి జత పరిచి ఇచ్చిన ఓఎంఆర్ తమదే అని ధృవీకరించుకున్న తర్వాతనే పరీక్ష రాయాలి. జవాబు పత్రం రెండు వైపులా బ్లూ లేదా బ్లాక్ పెన్నుతో స్పష్టంగా ప్ర శ్ననెంబర్ తెలుపుతూ సమాధానాలు రాయాలని ఎరుపు, గ్రీన్పెన్ను వాడ కూడ దనిసూచించారు.