Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
నవతెలంగాణ-సుబేదారి
గ్రామాలలో సంపదపెంచే దిశగా సీఎం కేసీఆర్ ప్రారం భించిన గొర్రెల పంపి ణీ పథకం రెండవ విడత కట్టుదిట్టం గా అమలు చేయాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ, సినిమాటో గ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి మంత్రి తలసాని, ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శి శాంతి కుమారిలు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి రెండవ విడత గొర్రెల పంపిణీ, కంటి వెలుగు, ఆరోగ్య మహిళా, పట్టణ ప్రాంతాలలో రెండుపడక గదుల నిర్మాణం, ప్రభుత్వ జీవో నెం.58, 59, 76, 118ల ప్రకారం చేయవల సిన క్రమబద్దీకరణ, పోడుభూములపై జిల్లా కలెక్ట ర్లతో వీడియో కాన్ఫరెన్స్లోసమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న గొల్లకురుమలకు, యాదవుల కు 75శాతం సబ్‌సీ డితో గొర్రెల యూనిట్పంపిణీ చేయాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ 2017 సంవత్సరంలో గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించారని, రాష్ట్ర వ్యాప్తంగా 7.31 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి 50 శాతం మొదటి దశలో పంపిణీ పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం రెండవ విడత గొర్రెల పంపిణీ కిం ద పెండింగ్‌లో ఉన్న 3.38 లక్షల మం దిగొర్రెల యూనిట్ల పంపిణీ జరుగు తుం దన్నారు. గొర్రెల యూనిట్ వ్యయాన్ని ప్రభుత్వం 1.25 లక్షల నుంచి రూ.1. 75 లక్షలకు పెంచిందని, 25శాతం అంటే రూ.43,750లు లబ్దిదారుడి వాటా, మిగి లిన రూ.1,31,250లు ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేస్తుందని, జిల్లాలో ఉన్న లబ్దిదారులతో అవగాహన సమావేశాలు నిర్వహించి లబ్దిదారుల నుండి వాటా సేకరించాలని మంత్రి తెలిపారు. ప్రతిజిల్లాలో గొర్రెల కొనుగోలుకు సంబంధించి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, కలెక్టర్ల ఆధ్వర్యం లో పకడ్బందీగా అమలు చేయాలని మం త్రి ఆదేశించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష
అనంతరం కంటి వెలుగు అంశం పై రా ష్ట్ర సీఎస్ శాంతి కుమారి సమీక్షిస్తూ రా ష్ట్రవ్యాప్తంగా47 రోజుల్లో 97 లక్షలమంది ప్రజలకు కంటిపరీక్షలు నిర్వహించి 15. 65 లక్షల రీడింగ్ కళ్ళద్దాలను పంపిణీ చేశామని, 12.18 లక్షల ప్రిస్క్రిప్షన్ కళ్ల ద్దాలను ఆర్డర్చేయగా, జిల్లాలకు 7.4లక్షల పైగా ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాలు చేరాయని సీఎస్ తెలిపారు. జిల్లాలకు చేరిన ప్రిస్క్రి ప్షన్ కళ్లద్దాలు త్వరితగతిన లబ్దిదారులకు వారి ఇంటి వద్ద అందించే విధంగా కలెక్టర్ లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎస్ సూచించారు. కంటి వెలుగు శిబిరాల నాణ్యత నిరం తరం పరిశీలించాలని, జిల్లాలో ఉన్న క్వాలిటీ కంట్రోల్ బృం దాలు విస్తృతంగా పర్యటించాలన్నారు. మహిళా దినోత్స వం సందర్భంగా ప్రారంభించిన ఆరోగ్య మ హిళ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 22 వేల 333 మహిళ లు పరీక్షలు నిర్వహించి 1132 మంది తదుపరి చికిత్స కో సం రిఫర్ చేయడం జరిగిందని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇంటి పట్టాల పంపిణీ కోసం సేకరించి ఖాళీగా ఉన్న భూముల వివరాలను నూ తనంగా రూపోందించిన పోర్టల్ లో నమోదు చేయా లని, ఈ పోర్టల్‌లో నూతన ఎంట్రీ లు, ఎడిట్, కన్ఫర్మేషన్ విభా గాలు ఉన్నాయని, ఎంఆర్ఓలు నమోదు చేసిన వివరాలు ఆర్డిఓ ధవీకరించాలని, ఈ ప్రక్రియ మూడు రోజులలో పూర్తి చేయాలని తెలిపారు.
భూముల క్రమబద్ధీకరణ అంశానికి సంబంధించి ప్రభు త్వం జారీ చేసిన ఉత్తర్వుల సంఖ్య 58, 59, 76, 118 లకు సంబంధించి పురోగతిపై సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ప్ర భుత్వ ఉత్తర్వు 58 సంబంధించి పెండింగ్ పట్టాల పంపిణీ వారం రోజులో పూర్తిచేయాలన్నారు. ప్రభుత్వం ఉత్తర్వు సంఖ్య 58,59 కింద దరఖాస్తు చేసుకునేందుకు మరో అవ కాశం కల్పించాయని, కటాఫ్ తేదీ 2020 జూన్ 02 వరకు పొడగించి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తుల స్వీకరణ గడువు ఉందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 58, 59 లో తిరస్క రణకు గురైన దరఖాస్తులు మరోసారి రివ్యూ చేసుకోని నూత న నిబంధనల ప్రకారం అర్హత సాధించే వారికి సమాచారం అందించాలని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్దిదారుల కేటాయింపులో మంచి పురోగ తి ఉందని సీఎస్ అభినందించారు. ఏప్రిల్ 15 నాటికి లబ్దిదారుల వివరాలను ఆన్ లైన్ నమోదు పూర్తి చేయాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జిల్లా లో ఆరోగ్య మ హిళా శిబిరాల్లో ప్రతి మంగళవారం స్క్రీన్ టెస్టులు, కాన్సర్, ఇతర సంబంధిత టెస్టులు 150 నుండి 200 మంది మహి ళలకు స్క్రీనింగ్ నిర్వహిస్తామని అన్నారు. డీ ఆర్ డీ ఏ,మెప్మ అధికారుల తో ఈ కార్యక్రమం ను వేగవంతం చేస్తామని అ న్నారు. 2 బీహెచ్ కే రిపోర్ట్ లను ఏప్రిల్ 15 లోగా అప్లోడ్ చేస్తాము అని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో , అడిషనల్ కలెక్టర్ సంధ్యా రాణి, డిఆర్ఓ వాసు చంద్ర, పరకాల ఆర్డిఓ రాము, డిఎం హెచ్‌వో సాంబశివరావు తదితర అధికారులు పాల్గొన్నారు.