Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్
నవతెలంగాణ-మట్టెవాడ
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 5వ తేదీన ఢిల్లీలో జరిగే మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ కోరారు శనివారం కాకతీయ మెడికల్ కాలేజీలో ఛలో ఢిల్లీకి సంబంధించిన కరపత్రాలతో ప్రచారం చేశారు. అనంతరం సమ్మయ్య అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో రాగుల రమేష్ పాల్గొని మాట్లాడారు. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దుచేసి కార్మికులందరినీ క్రమబద్ధీకరించాలని అంతవరకూ కనీస వేతనం నెలకు 26వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు గత తొమ్మిది సంవత్సరాల క్రితం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కార్మిక సంక్షేమం పేరుతో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా కార్మికులు ప్రజల మీద భారాలు వేస్తూ దేశ సంపదను ఆదాని అంబానీలకు అప్పగించాడని దుయ్యబట్టారు కార్మికులకు వ్యతిరేకమైన నాలుగు కార్మిక కోడులను తీసుకొని వచ్చి కార్మిక హక్కులను హరించి వేశాడని తక్షణమే కార్మిక వ్యతిరేక నాలుగు కోడ్ లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు రైతులు పండించిన పంటకు మద్దతు ధరను అందించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ రంగ సంస్థల ప్రవేటికరణ ఆపాలని ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి 14 రకాల సరుకులను ఉచితంగా ప్రజలకు అందించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కనీస పెన్షన్ రూ.10వేలు ఇవ్వాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని రాగుల రమేష్ డిమాండ్ చేశారు ఐదు లక్షల మందితో జరిగే చలో ఢిల్లీ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కాకతీయ మెడికల్ కాలేజ్ నాయకులు రామకష్ణ, నరేష్ ,గీత, రమ, లక్ష్మి, విజయ ,వరలక్ష్మి, శోభారాణి లతోపాటు కార్మికులు పాల్గొన్నారు.