Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో భూపాలపల్లి పెయింటర్స్ అసోసియేషన్స్ కమిటీ సభ్యులచే పదివేల కి.మీ.స్వరాజ్య పాదయాత్ర కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి డి.ఎస్.పి జిల్లా అధ్యక్షులు కొత్తూరు రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి దోమటి రవీందర్, హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ని 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల స్వరాజ్య స్థాపనకై.. దళిత శక్తి ప్రోగ్రామ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్. విశారదన్ మహారాజ్ , 30 మంది బంద సభ్యులతొ పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర 2022 మార్చి నెలలో 15 తేదీన మాన్యవర కన్షిరాం గారి జయంతిని గుర్తుచేస్తూ నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి పట్టణం నుండి లక్ష మందితో 10 వేల కి.మీ.''స్వరాజ్య పాదయాత్ర'' ప్రారంభించుకుని.తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల,300 మండలాలు 5000 గ్రామాల మీదుగా కాలినడక చేస్తూ 2023 ఏప్రిల్ నెలలో 10 లక్షల మందితొ హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ చేసి పాదయాత్ర ముగుస్తుందని వారు తెలిపారు అందుకని బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు అనంతరం స్వరాజ్య పాదయాత్ర కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి పెయింటర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రాజమోగిలి , ఉపాధ్యక్షులు రఘు, రమేష్ ,ఎస్.కె పాషా ,ప్రధాన కార్యదర్శి విజయ్, కోశాధికారి సంపత్, గుండ్ల ఓంకార్, ప్రమోద్ పాల్గొన్నారు.