Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ జోడో యాత్రలో ఆదరణ చూసి ఓర్వలేని ప్రధాని మోదీ..
- గండ్ర వెంకటరమణారెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసింది ?
- తినడానికి తిండి లేదా..? ఉండడానికి ఇళ్లు లేదా ?
- వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచేది సత్తన్నే..
- విలేకరుల సమావేశంలో భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య.
నవతెలంగాణ-భూపాలపల్లి
పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రశ్నలకు జవాబు చెప్పలేకే మోదీ కుట్రపూరితంగా అనర్హత వేటు వేశారని భద్రాచలం ఎమ్మెల్యే, భూపాలపల్లి నియోజకవర్గ ప్రెస్ మీట్ ఇంచార్జీ పోదెం వీరయ్య అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి ప్రెసిడెంట్ అయిత ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టిపిసిసి సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణ రావు తో కలిసి భద్రాచలం ఎమ్మెల్యే, భూపాలపల్లి పోదెం వీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాహుల్ గాంధీపై లోక్ సభ అనర్హత వేటు దుర్మార్గమని అన్నారు. కోర్టు అప్పీలుకు 30 రోజుల సమయం కూడా ఇచ్చినప్పటికీ, అనర్హత వేటు వేయడం ఏంటని ప్రశ్నించారు.రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారని, వాటిని ప్రధాని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తనకు కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసిందని పార్టీ మారాడని ప్రశ్నించారు.
తనకు తినడానికి తిండి లేదా..? ఉండడానికి ఇళ్లు లేదా..? అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో భూపాలపల్లిలో భారీ మెజారిటీతో గెలిచేది మన గండ్ర సత్తన్నే అని ఎమ్మెల్యే పోదెం వీరయ్య అన్నారు. గండ్ర సత్తన్న అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి అని, నిత్యం ప్రజల్లోనే ఉంటూ, భూపాలపల్లి ప్రజలకు సేవ చేస్తున్నారని కితాబు ఇచ్చారు.అనంతరం గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ..అదానీ షెల్ కంపెనీలకు రూ.20వేల కోట్లు ఎవరికి చెల్లించారో మోదీ వివరణ ఇవ్వాలని అన్నారు. ఏప్రిల్ 16, 2019న బిజెపి ఎమ్మెల్యే పూర్ణేష్ రాహుల్ గాంధీపై కేసు పెట్టారని, అప్పుడు పూర్ణేష్ కేసును పరిశీలించిన అప్పటి సూరత్ కోర్ట్ అతనిపై మొట్టికాయలు వేయడంతో పూర్ణేశ్ సూరత్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ కొనసాగనివ్వకుండా గుజరాత్ హైకోర్ట్ నుండి స్టే తెచ్చుకున్నారు.
ఫిబ్రవరి 7, 2023న రాహుల్ గాంధీ లోక్‌సభలో అదానీ, మోదీ మధ్య సంబంధాన్ని తీవ్రస్వరంతో ప్రశ్నించారన్నారు. అందులో ముఖ్యంగా సూరత్ చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి బదిలీ అయి, కొత్త జడ్జీ నియమితులైన తరువాత రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేసిన వ్యక్తే హైకోర్టుకు వెళ్ళి విచారణపై స్టే వెకెట్ చేయించుకున్నారని అన్నారు. రాహుల్ గాంధీ లోక్‌సభలో అదానీ, మోదీ మధ్య సంబంధాన్ని తీవ్రస్వరంతో ప్రశ్నించిన తర్వాత పూర్ణేశ్ మోదీ తిరిగి రంగప్రవేశం చేశారు. ఆగమేఘాల మీద గుజరాత్ హైకోర్టులోని తన స్టే అభ్యర్థనను ఫిబ్రవరి 16న ఉపసంహరించుకున్నారని, హైకోర్టులో స్టే ఉపసంహరించుకున్న 11 రోజులలోనే అనగా, ఫిబ్రవరి 27న కోర్టులో విచారణలు తిరిగి ప్రారంభమయ్యాయని, విచారణ ప్రారంభమైన 25 రోజులలో అనగా మార్చి 23న కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి, రెండేళ్ళ జైలు శిక్ష విధించిందని పేర్కొన్నారు. దేశంలో మోదీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, దోపిడీని నివారించి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పని చేయాలని కోరారు.
ఈ సమావేశంలో టౌన్ ప్రెసిడెంట్ ఇస్లావత్ దేవన్, టీపీసీసీ సభ్యులు చల్లూరి మధు, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ దూడపాక శంకర్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు దండు రమేష్, పోరిక సమ్మయ్య, వెంపటి భువన సుందర్, ఉడుత మహేందర్, పిప్పాల రాజేందర్, బుర్ర కొమురయ్య, అంబాల శ్రీను, కంచర్ల సదానందం, భట్టు కరుణాకర్, లింగమల్ల శారద, మహేష్ రెడ్డి, పొనగంటి శ్రీనివాస్, అప్పాల శ్రీనివాస్ యాదవ్, తోట రంజిత్, హాఫిజ్, నగునూరి రజినీ కాంత్, కిషోర్ రెడ్డి, గురిజాల రవి, బుర్ర రజినీకాంత్, పోల్సాని కరుణాకర్, బౌతు రాజేశ్, సతీష్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.
రాహుల్‌పై అనర్హత వేటు వేయడం సబబు కాదు :
నరసయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షులు
నవతెలంగాణ-రేగొండ
కాంగ్రెస్ పార్టీ నాయకుడు భారతదేశ కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ పై లోకసభ ఆనర్హత వేటు వేయడం సబబు కాదని కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇప్పకాయల నరసయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత దేశ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సుమారు 4000 కిలోమీటర్లు భారత్ జూడో పాదయాత్ర చేసిన సందర్భాన్ని ప్రజలు ఆదరిస్తే అది చూసి ఓర్వలేని ఈ మోదీ ప్రభుత్వం ఈరోజు మా రాహుల్ గాంధీ పైన కుట్రపూరితమైన కేసులను ఇరికించి పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడం కుట్రపూరితమైన చర్యని ఈ రాజకీయ కక్ష సాధింపు చర్య అని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆదరణను ప్రజలు అభిమానించే నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడని ఆలోచనతో ఓర్వలేని ఈ నీచమైన బిజెపి ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రానున్న రోజుల్లో దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని ఆయన ఆశ భావ వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజలు గమనిస్తున్నారు దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో రాజకీయాలు రాజకీయ విలువలను మంట కలుపుతున్న ఈ పాలించే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ప్రజాస్వామ్యానికి క్షమాపణ చెప్పవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో రేగొండ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు బానోతు రవీందర్ రేగొండ మండల ఉపసర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షులు గండి తిరుపతి యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎం డి అస్లం పాషా రేగొండ గ్రామ కమిటీ అధ్యక్షులు బొల్లెపల్లి చంద్రమౌళి ఎండి రహీం తదితరులు పాల్గొన్నారు.