Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని లక్ష్మీనగర్‌కు చెందిన కారుపాకల కొమురమ్మ ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి ఖర్చుల పాలయింది. ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకోగా శనివారం మంజూరైన రూ.34 వేల చెక్కును మండల ఎంపీపీ చింతలపల్లి మల్హర్రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య బాధితురాలుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చెంద్రయ్య, ప్రభాకర్,రాజు,మదు,నర్సింగరావు,రాజా సమ్మయ్య, దుర్గాప్రసాద్, శ్రీనివాస్, సతీష్ పాల్గొన్నారు.