Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ములుగు
పోరిక శ్యామల్ నాయక్ చేపట్టిన జాగతి చైతన్య కళాయాత్ర ప్రజలను ఆకట్టుకుంటుంది. కళా యాత్రలో భాగంగా ములుగు మండలంలో ఆదివారం జంగాల పల్లి లో సర్పంచ్ మస్రగాని అనిత వినరు కుమార్ అనుమతి తో గ్రామ వార్డు మెంబర్స్ తో కలిసి ఇంటింటికి ఆత్మీయ తగా పలకరిస్తూ ర్యాలీగా వెళుతూ ఓటు చైతన్యం గురించి వివరిస్తూ గ్రామంలో తిరిగారు. సాయంత్రం 7 గంటలకు శ్యామ్ కళాబందం వారిచే మూఢనమ్మకాల గురించి బాల్య వివాహాలు చేయకూడదని ఆటపాటల ద్వారా వివరిం చారు. జంగాలపల్లి గ్రామంలో శ్యామ్ కళా యాత్ర మస్ర గాని అనిత వినరు కుమార్ సర్పంచ్ అనుమతితో ఉప సర్పంచ్ మొగిలి,వార్డ్ సభ్యులు జంగాలపల్లి గ్రామం టప్ప కష్ణయ్య ద్వారా గ్రామం ప్రాచూర్యం పొందింది అన్నారు. సాయంత్రం 7గంటలకు ఎస్సీ కాలనీలో శ్యామ్ కళాబందం కార్యక్రమం 500 మంది ఆడ మగవారు వీక్షిస్తుండగా కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ మేడంలు వసంత బోల్లి కవిత మరియు ఆశ వర్కర్లు జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత మేడం ఆనతితో బాలింతలకు అందరికీ చిరుధాన్యాల ఆవశ్యకత గురించి అంగన్వాడీలను ఏ విధంగా వాడుకోవాలి శ్యామ్ 10 మంది కళాకారులతో కలిసి ఆటపాట ద్వారా వివరించారు. వార్డ్ మెంబర్ మేకల సుశీల, గ్రామ పెద్దమనుషులు మేకల మొగిలి నూనె బాగా శంకర్ మామిడి చెట్టు వెంకన్న అందరి సమక్షంలో దాసి వనమాల, శ్యామల్ నాయక్ ఘంటసాల సుశీల పాటలు పాడి అందరినీ ఆకట్టుకున్నారు. శ్యామ్ చేసే జన చైతన్య కళాయాత్రలో స్వచ్ఛందంగా జంగాలపల్లి గ్రామ కళాకారులు బొచ్చు అరుణ్ కుమార్,రేణుకుంట్ల శ్రీధర్ , ఇనుముల రంజిత్, దూడపాక రాజేందర్ మరియు బోదానంద దాసి వనమాల ని పోరిక శ్యామల్ నాయక్ ఘనంగా శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంలో గ్రామ పెద్దమనుషుల అందరూ కలిసి శ్యామ్ నిండు నూరేళ్లు బ్రతకాలని రాజకీయంలోకి రావాలని నినాదాలు చేశారు. శ్యామ్ మీ కోరికను మన్నిస్తాం అని చెప్పారు.