Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విభేదాలు వీడి పార్టీ గెలుపునకు ఏకమవ్వాలి : మంత్రులు దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్
- సదా మీ సేవలోనే - ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఎంపీ కవిత
నవతెలంగాణ-మరిపెడ
పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు కార్యకర్తలే పునాదులు, వారి కృషి, వారి ఉద్యమ పోరాటాలు కేసీఆర్ మొక్కవోని దీక్ష వెరసి తెలంగాణ సిద్దించింది. మన పాలన మన చెంతకు చేరింది.తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ దేశానికే అన్నం పెట్టె స్థాయికి ఎదిగింది. దీనికంతటికి కార్యకర్తల కృషి, పట్టుదలే కారణం అందుకే బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం, బలగం అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం మరిపెడ మండల కేంద్రంలోని లక్ష్మారెడ్డి గార్డెన్స్ లో స్థానిక ఎమ్మెల్యే రెడ్యానాయక్ అధ్యక్షతన జరిగిన మరిపెడమండల స్థాయి ఆత్మీ య సమ్మెళనానికి మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, మానుకోట జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్ పర్సన్ బిందు, బీఆర్ఎస్ రాష్ట్ర్ట నాయకులు రామ సహాయం రంగరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గుడిపూడి నవీన్ రావులతో కలిసి ముఖ్య అతిథితులుగా హాజరైయ్యారు. తొలుత మానుకోట జిల్లా ఆత్మీయ సమ్మెళనాల ఇన్చార్జ్ పురాణం సతీష్ కేసీఆర్ కార్యకర్తలకు పంపిన ఆత్మీయ సందే శాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ రెడ్యానాయక్ అంటే కార్యకర్తలు, కార్యకర్తలు అంటే రెడ్యానాయక్.. అలా ఉన్నాను కాబట్టే ఆరు సార్లు ఒకే నియోజకవర్గం నుంచి గెలుపొందానన్నారు. కార్యకర్తల ఎనలేని కషి, క్రమశిక్షణ వల్లే రెడ్యానాయక్‌కు ఇన్నేళ్లు ప్రజా సేవ చేసే భాగ్యం కలిగిందన్నారు. తన పని తనాన్ని మెచ్చి జనరల్ స్థానమైన, రిజర్వేషన్ స్ధానమైన ప్రజలు గెలిపిస్తున్నారని, మారుమూల తండాలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన తాను కార్యకర్తల నిరంత శ్రమ, ప్రజల దీవెనలతోనే ఆరుసార్లు గెలిచాన న్నారు. అందుచేతనే ఎన్నేళ్లయినా తన ప్రజల కోసం నియోజవకర్గంలోనే ఉన్నాన ని, ప్రజల కష్టసుఖాల్లో భాగం పంచుకుంటూ ఏ సమయమైనా 24గంటల్లో ఏ సమయమైనా స్పందిస్తూ ప్రజలకు సేవలందిస్తున్నానన్నారు. ఇన్నేళ్ల తన రాజ కీయ జీవితంలో బీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీని చూడలేదన్నారు. తెలంగాణ ఏర్ప డి తొమ్మిదేళ్లే అయినా నేడు దేశాన్ని సాదుతున్న రాష్టాల జాబితాలో నాలుగో స్థా నంలో నిలవటం కేసీఆర్ పనితనానికి నిదర్శనం అన్నారు. ప్రజలకు సంక్షేమం, గ్రామాలకి అభివద్ధి, నిరుద్యోగులకు ఐటీ కారిడార్, స్వయం ఉపాదిపొందే వారికి రుణాలు, పారిశ్రామిక కంపెనిల పెట్టుబడులు ఇలా తొమ్మిదేళ్లలో తెలంగాణను అబ్బుర పరిచే స్థాయికి, ప్రధానంగా రైతాంగాన్ని రాజును చేసిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. అందుకే మరోమారు బీఆర్ ఎస్ గెలిచేలా ప్రతి కార్యకర్త కషి చేయాలని, ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమాలు వివరించాలని సూచించారు.
మా మధ్య వస్తే నలిగి పోతారు : మంత్రి సత్యవతి రాథోడ్
మధ్య ఎలాంటి పంచాయతీ లేదు.. మా మధ్య ఎలాంటి వర్గాలు, విభేదాలు, పంచాయతీలు లేవని.. మేమంతా కలిసి పనిచేశుతున్నామని, మా మధ్యకు ఎవ రైనా వస్తె నలిగిపోతారని, మంత్రి సత్యవతి రాథోడ్ విర్శకులకు ఘాటైన జవాబి చ్చారు. మరిపెడ ఆత్మీయ సమ్మెళనానికి ముఖ్యఅతిథిగాహజరైన ఆమె తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారని, గిరిజన మంత్రిగా రాష్ట్రంలోని గిరి జన ప్రాంతాల అభివృద్ధిలో తన భాగస్వామ్యం ఉండడం నిజంగా తన అదష్టంగా భావిస్తున్నన్నారు. 75 ఏళ్లుగా పాలించిన పాలకులు ఏనాడు 24 గంటలు విద్యుత్ ఇవ్వలేదని, మంచినీటి సమస్య తీర్చలేదని, ఆడబిడ్డ పెళ్ళికి కళ్యాణ లక్ష్మి, షాదీ ము బారక్ కింద రూ.1లక్ష ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వాదే అన్నారు. అమా వాస్యకు పౌర్ణమికి ఒకసారి వచ్చే నాయకులు వస్తారు పోతారు..కాబట్టి ప్రజలు గుర్తించి పార్టీ కోసం పనిచేయాలన్నారు. మారు మూల ఏజన్సీ గ్రామాలకు రోడ్ల ను ఇచ్చి ఆ ప్రాంత ప్రజల చైతన్యం కోరుకున్న పార్టీ మనదన్నారు. ఆడపిల్లల గురు కులాలు ఎక్కువ మన జిల్లాకు కేటాయించారన్నారు. డోర్నకల్ నియోజక వర్గంలో రెడ్యానాయక్ గెలుపుకోసం అంతాఒక్కటిగా కృషి చేద్దామన్నారు.
పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటాం : ఎంపీ మాలోత్ కవిత
పార్టీకి కీలకమైన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, వారి ఆర్థికాభివద్ధికి అన్ని విధాల అదిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మానుకోట జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవిత అన్నారు. ఒక పూట పస్తులు ఉండైనా కార్యకర్తలను రక్షించుకునే బాధ్యత తమపై ఉందన్నారు. ఆపద వస్తే తనకి ఒక్క కాల్ చేస్తే స్పందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రామ సహాయం రంగారెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడి నవీన్ రావు జడ్పీ చైర్పర్సన్ బిందు ,మరిపెడ మండల ఎంపీపీ గుగులోతు అరుణ రాంబాబు, మరిపెడ మున్సిపాలిటీ చైర్ పర్సన్ సింధూర కుమారి రవి నాయక్ ,జెడ్పిటిసి శారదా రవీందర్ నాయక్, డోర్నకల్ యువనేత డి ఎస్ రవిచంద్ర , మరియు నియోజకవర్గస్థాయి మండల స్థాయి గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.