Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
ఈ ప్రాంతానికి చెందిన సర్దార్ సర్వాయి పాపన్న సేవ లు చిరస్మరణీయమని అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశారు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, జనగామ అధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాప న్న గౌడ్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట కార్యదర్శి బూడిద గోపి, రాష్ట ఉప అధ్యక్షులు బాల్నే వెంకట మల్లయ్య గౌడ్, గౌడ సంఘ హక్కుల పోరాట సమితి ఉప అధ్యక్షులు, మూలా వెంకటేశ్వ ర్లు గౌడ్, గౌడ సంఘ అధ్యక్షులు ఆంజనేయ గౌడ్ , మార్క ఉపేందర్, బస్వాగాని మహిందర్, బుషి గంపల సమ్మయ్య, పి, కుమారస్వామి, వివిధ గౌడకుల సంఘాల సభ్యులు పా ల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గొప్పతనాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూవెనుక బడిన తరగతులకు చెందిన సర్వాయి పాపన్న వీరోచితుడు అన్నా రు. బడుగు బలహీన వర్గాల ప్రయోజనం కోసం పని చేశా రని అన్నారు. ఈ కార్యక్రమంలోతరగతుల అభివృద్ధి అధికా రి శ్రీ బి. రవిందర్, ఆర్డివో మధుమోహన్,ఆయా సంఘాల నాయకులు,వడ్లకొండ లక్ష్మి నారాయణ గౌడ్, జిల్లా బిసి వసతి గహ సంక్షేమ అధికారులు, కార్యాలయ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు
కొడకండ్ల : భూమికోసం విముక్తి కోసం బీసీల అందరినీ ఏకతాటికి తెచ్చి నా పోరాట యోధులు సర్దార్ స ర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలను ఆదివారం మండల కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాలవేసి వర్ధంతి వేడు కలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ మధుసూదన్ మార్కెట్ కమిటీ పేరం రాము సర్దార్ సర్వాయి పాపన్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమం లో గౌడ కమిటీ సభ్యులు బీసీలు తదితరులు పాల్గొన్నారు.
బహుజన చక్రవర్తి సర్ధార్ సర్వాయి పాపన్న
స్టేషన్‌ఘన్‌పూర్ : బహుజన చక్రవర్తి సర్ధార్ సర్వాయి పాపన్నయని వైస్ఎంపిపి, సర్పంచ్ చల్లా ఉమా, సుధీర్ రెడ్డి అన్నారు. పాపన్న 313వ వర్ధంతి ఉత్సవాలను మండలం లోని తాటికొండలో గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కార్యద ర్శి ఐలోని సుధాకర్, థానేధార్పల్లి గ్రామాలలో మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్, కల్లు గీతా కార్మిక సంఘం మండ ల అధ్యక్షుడు రఘురాములు అధ్యక్షతన ఆదివారం నిర్వహిం చారు.ఈసందర్భంగా పాపన్న విగ్రహానికి ఆధ్వర్యంలో పూల మాల వేసి నివాళ్ళర్పించారు. బహుజనుల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ సమకాలికులు, ఆనాటి నిరంకుశ రాజరికపు పాలకులకు వ్యతిరేకంగా బడుగు, బలహీన వర్గాలను ఏకం చేసి గోల్కొండ కోటతో పాటు తెలంగాణ ప్రాంతంలో సుమా రు 32 కోటలను జయించి బడుగు, బలహీన వర్గాలకు రా జ్యాధికారాన్నీ అందించిన భారతదేశపు తొలి గొప్ప బహుజన చక్రవర్తి సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఈకార్యక్రమంలోమాజీ సర్పంచ్ సానాది సంధ్యరాజు, గ్రామ శాఖ అధ్యక్షులు పొన్నం శ్రీనివాస్, ఉప సర్పంచ్ మారపాక రాములు, వార్డు సభ్యులు రమా, పద్మ, నాగరాజు, రేణుక, ఎల్లస్వామి, తదితరులు పాల్గొన్నారు.
పాపన్న గొప్ప వీరుడు : మంత్రి ఎర్రబెల్లి
దేవరుప్పుల : సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి ని పురస్కరించుకొని, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి ఆ తర్వాత, పెద్ద మడూరు, నల్ల కుంట తండా గ్రామాల ము ఖ్య నాయకులు, కార్యకర్తలతో, మహిళలతో ఆత్మీయ సమ్మే ళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రిఈ సందర్భంగా గౌడ సోదరుల కోరిక మేరకు కల్లు రుచి చూసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుమంత్రి గారి మీద అభిమానంతో గౌ డ సోదరులు పోటీ పడి కల్లు పోశారు.పట్టు పట్టిన మంత్రి ఒక పట్టు పట్టాలని అభ్యర్థించడంతో మంత్రి కాదనలేని స్థితిలో ఆ కల్లు తాగి వారి పై తమ అభిమానాన్ని చాటుకు న్నారు.కల్లు రుచి బాగుందని చెప్పి అభినందించారు మంత్రి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పా పన్నకు పుష్పాంజలి ఘటిస్తున్నాను. సర్దార్ సర్వాయి పాప న్న గొప్ప పోరాట యోధుడు,అతి చిన్న కుటుంబంలో పుట్టి,అతి గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తి. ఆయన కేవలం వ్యక్తి మాత్రమే కాదు శక్తి.నిజాం పాలన పై తిరుగుబాటు చేసి, ఆ పాలన పై యుద్ధం ప్రకటించారు.
కంఠ మహేశ్వర దేవాలయ ప్రారంభం
ఇక కంఠ మహేశ్వర దేవాలయ నిర్మాణానికి సహకరిం చిన బబ్బూరి శ్రీకాంత్ గౌడ్‌కు అభినందనలు తెలిపారు. అం దరూ సంపాదిస్తారు కానీ, ఖర్చు చేసే గుణం కొంత మందికే ఉంటుంది. అలా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న శ్రీకాంత్ కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా చూడాలి. గౌడలు పొదుపు చేయాలి. తమంతోటి వారికి సహాయపడాలి. శ్రీకాంత్‌ను చూసి నేర్చుకోవాలి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతిని ధులు, గౌడ సంఘాల ప్రముఖులు, విగ్రహ ప్రతిష్ఠాపన సం ఘం బాధ్యులు, గ్రామ ప్రముఖులు, ప్రజలు, వివిధ ప్రాం తాల నుంచి తరలి వచ్చిన గౌడ సోదరులు, పెద్ద మడూరు గ్రామం, నల్ల కుంట తండా ప్రజలు పాల్గొన్నారు.
ఘనంగా సర్వాయి పాపన్న వర్ధంతి : బెల్లయ్య నాయక్
నెల్లికుదురు : బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 313వ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకు న్నట్లు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్మన్ డాక్టర్ బెల్ల య్య నాయక్ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ కమిటీ అధ్య క్షుడు గడ్డం యాలాద్రి మాల మహానాడు జాతీయ రాష్ట్ర పోలిట్ బ్యూరో చైర్మన్ ఆశోదా భాస్కర్ మాజీ జెడ్పిటిసి హె చ్ వెంకటేశ్వర్లు తెలిపారు మండల కేంద్రంలోని సర్దార్ సర్వా యి పాపన్న విగ్రహానికి పూలమాలవేసే కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీలను బడుగుల జాతిని ఏకం చేసి గోల్కొండ కోటపై జెండాను ఎగరవేసిన ఆ గరుడ సర్దార్ సర్వాయి పాపన్న అని అన్నారు బహుజన ఏకం చేసి బహుజన అభివద్ధి కోసం పాటుపడిన వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బీరవెల్లి యాదగిరి రెడ్డి ఎంపీటీసీలర్ సంఘం రా ష్ట్ర కార్యదర్శి పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్, ఉపాధ్యక్షులు సుధాకర్ ఉపేందర్ గౌడ్ ప్రధాన కార్యదర్శి కురియాల కష్ణయ్య గౌడ్ వీరగాన్ని మల్లేష్ గౌడ్ కుమ్మరి కుంట్ల మౌనేందర్ సట్ల యాకయ్య వడ్లకొండ శ్రీరాములు గౌడ సంఘ నాయకులు పాల్గొన్నారు.
పాపన్న జీవితం ఎందరో ఆదర్శం : మంత్రి దయాకర్
తొర్రూరు : సర్దార్ సర్వాయి పాపన్న జీవితం ఎందరికో ఆదర్శమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులోని సర్వాయి పాపన్న విగ్రహానికి పూలదండ వేసి పుష్పాంజలి ఘటించారు. సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా మంత్రి మాట్లాడారు. సర్దార్ సర్వాయి పాపన్న జీవితం ఎందరికో ఆదర్శం ఆయన మన వాడు కావడం, మన తెలంగాణ బిడ్డ కావడం మన అదష్టం అని తెలిపారు. నాడు సాధారణ కల్లుగీత కార్మికుడైన సర్దార్ సర్వాయి పాపన్న కేవలం 12 మందితో ఒక గుంపును ఏర్పా టు చేసి, నాటి నిజాం రజాకర్లపై తిరుగుబాటు చేసి 12 వేల మంది సైన్యాన్ని తయారుచేసిన యోధుడు సర్వాయి పాప న్న, ప్రభుత్వం అధికారికంగా సర్వాయి పాపన్న జయంతి వర్ధంతులను నిర్వహిస్తున్నారు. హైదరాబాదులో ఐదు ఎక రాల స్థలంలో ఒక భవనం నిర్మిస్తున్నది. అనేక కార్యక్రమాలు చేపడుతూ సర్వాయి పాపన్న పేరును చిరస్థాయిగా నిలిచే విధంగా చర్యలు చేపట్టింది ఆయన వివరించారు.ఈ కార్య క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గౌడ సం ఘ, బీసీ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.
నిజాంను ఎదురించిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ : మార్క శ్రీనివాస్ గౌడ్
తొర్రూర్ రూరల్ : సమాజంలో జరిగే అక్రమాలను ఎదుర్కొని, నిరుపేదల బాసటగా నిలిచిన మహనీయుడు, గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అమ్మాపురం గౌడ కళ్ళు గీత కార్మిక సొసైటీ అధ్యక్షుడు మా ర్క శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 313వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం మం డలంలోని అమ్మాపురం గ్రామంలో గౌడ కళ్ళు గీత కార్మిక సొసైటీ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల సమర్పించి, ఘన నివాళులర్పించారు.ఈ సంద ర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సర్వాయి పాపన్న అం దరివాడిగా గుర్తిం పబడ్డారని పేర్కొన్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్ గ్రామంలో సర్దా ర్ సర్వాయి పాపన్న గౌడ్ జన్మించి, కుల వృత్తిని నమ్ముకోని జీవిస్తున్న తరుణంలో తురుష్క ఆగడాలను సహించలేక గేరి ల్లా సైన్యాన్ని సమకూర్చుకొని తురుష్కులపై 1687 నుండి 1724 వరకు తిరుగుబాటు చేసి, దాడులను అరికట్టార న్నారు. పాపన్న స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సేవలకు అంకితం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ కల్లు గీత కార్మిక సొ సైటీ ఉపాధ్యక్షుడు బూరుగు వీరేశ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మాచర్ల అరవింద్ గౌడ్, డైరెక్టర్లు, గౌడ సంఘం సభ్యులు, నవయుగ యూత్ అధ్యక్షుడు మార్క ప్రకాష్ పాల్గొన్నారు.