Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
- మండల విద్యాశాఖ అధికారి యాప సాంబయ్య
నవతెలంగాణ- తాడ్వాయి
పదో తరగతి వార్షిక పరీక్షలు నేటి సోమవారం నుంచి ప్రారంభం కానుండగా, మండల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పరీక్షలు జరగనున్నాయి. మండల వ్యాప్తంగా మేడారం, ఇందిరానగర్ (తాడ్వాయి మండల కేంద్రం) అనే రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండల వ్యాప్తంగా ఇందిరానగర్, నార్లా పూర్, కాటాపూర్, బీరెల్లి నాలుగు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలు, కోడిశెల, ఊరటం, మేడారం, తాడ్వా యి నాలుగు ఆశ్రమ పాఠశాలలు, ఒక కేజీబీవీ మొత్తం మండల వ్యాప్తంగా 265 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాన్నారు. 265 మంది విద్యార్థుల కు గాను మేడారం, ఇందిరానగర్ అను రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మేడారం పరీక్షా కేంద్రంలో కోడిశెల బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల 18 మంది, నారాపూర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల 8 మంది, ఊరటం ఆశ్రమ పాఠశాల 25 మంది, మే డారం ఇంగ్లీష్ మీడియం 99 మంది మొత్తం 150 మంది విద్యార్థులు మేడారం పరీక్ష కేంద్రంలో పరీక్షలు రాయనున్నారు. తాడ్వాయి ఇంద్రనగర్ పాఠశాల పరీక్షా కేంద్రంలో ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల తాడ్వాయి 45 మంది, జడ్.పి. హెచ్.ఎస్ ఇందిరానగర్ హై స్కూల్ లో 12 మంది, కేజీబీవీ లో 23 మంది, జడ్.పి.హెచ్.ఎస్ కాటాపూర్ హైస్కూల్లో 26 మంది, జడ్.పి.హెచ్.ఎస్ బీరెల్లి లో 9 మంది మొత్తం 115 మంది విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలు రాయమన్నారు. మేడారం ఇంగ్లీష్ మీడియం పాఠశాల, ఇందిరానగర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల రెండు పరీక్ష కేంద్రాల్లో మొత్తం విద్యార్థులు 265 మంది విద్యార్థినీ విద్యార్థులు పదవ తరగతి వార్షిక పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలను ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు 3 గంటల పాటు పరీక్ష జరగనుంది. విద్యార్థులను గంట ముందు ఉదయం 8.30 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. గరిష్టంగా ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే వారిని మాత్రమే కేంద్రంలోకి అనుమతిస్తారని అధికారులు స్పష్టం చేశారు. 9:35 దాటితే ఎట్టి పరిస్థితులను పరీక్షకు అనుమతించవమని ఎంఈఓ సాంబయ్య తెలిపారు. పరీక్షలు రాసే విద్యార్థులకు మంచినీటి ఫ్యాను బెంచీలు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి యాప సాంబయ్య పేర్కొన్నారు.