Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
నవతెలంగాణ-భూపాలపల్లి
ప్రస్తుత సమాజంలో కొంతమేర జర్నలిస్టులకు గౌరవం తగ్గిందని, నైతికతతో విధులు నిర్వహిస్తూ జర్నలిజానికి పూర్వ వైభవం తెచ్చేదిశగా పాత్రికేయులు చిత్త శుద్ధితో పనిచేయాలని రాష్ట్ర అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఆదివారం సింగరేణి ఇల్లందు క్లబ్ హౌస్ లో జిల్లాలోని పాత్రికేయులకు ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణ ముగింపు కార్యక్ర మంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో జర్నలిస్టుల పట్ల గౌరవం కొంతమేర తగ్గిందని, యూట్యూబ్, డిజిటల్ మీడియా వచ్చిన తరువాత చాలా తప్పుడు వార్తలు ప్రచారం కావడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం పోటీ ప్రపం చంతో పోటీపడుతూ వార్తలు సేకరించాల్సి ఉంటుందని, జర్నలిస్టులకు ఉప యోగపడే విధంగా వారి నైపుణ్యాలు అభివద్ధి చేసేందుకు ప్రెస్ అకాడమీ శిక్షణ తరగ తులు నిర్వహిస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో శిక్షణ తరగతులు ము గించామని, ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 1200 మంది జర్నలిస్టులు శిక్షణ అందించామని అన్నారు. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండు రోజులపాటు నిష్ణాతులైన ప్రతినిధులచే శిక్షణ అందించడం జరిగిందని దీన్ని పాత్రికేయులు సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వార్త ప్రచారం వేగంగా జరుగుతుందని, ఒక తప్పుడు మాట మాట్లాడినా వెంటనే వ్యాప్తి చెంది అప్పటి వరకు ఉన్న పేరు కోల్పోవాల్సి వస్తుందని అన్నారు.జర్నలిస్టులు నైతికతతో ఉండాలని ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని, ప్రస్తుత సమయంలో అధికంగా మిస్ ఇన్ఫర్మేషన్ తప్పుడు వార్తలు అధికమవుతున్నాయని, దీని నివారణకు జర్నలిస్టులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన సూచించారు. సమాజంలో జరుగుతున్న కొత్త కొత్త పరిమాణాలను గుర్తిస్తాయిలో విశ్లేషించి ప్రజలకు వాస్తవాలు తెలిసే విధంగా జర్నలిస్టులు పనిచేయాలని, ఉదాహరణకు ఆదానిపై ఇటీవల వచ్చిన రిపోర్ట్ సారాంశం పరిశీలించి, వాస్తవ పరిస్థితులు తెలియజేస్తూ వార్తలు రాయడం వల్ల ప్రజలలో జర్నలిస్టులకు గౌరవం మర్యాద పెరుగుతాయని ఆయన పేర్కోన్నా రు. రాజకీయ వార్తలు సంబంధించి కవర్ చేసే సమయంలో వార్తాపత్రికలలో వివిధ పార్టీల రాజకీయ నాయకులు వాడే అసభ్యకర పదజాలం రాకుండా జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. జిల్లాలోని జర్నలిస్టులకు రెండు రోజుల నిర్వహించిన శిక్షణ తరగతులు తెలంగాణ సాంస్కతి సారధి కళాకారుల ఆటపాటలతో ప్రారంభించి అధ్యాపకుల ట్రైనింగ్ క్లాసులతో విజయవంతంగా ముగిశాయి, రెండు రోజులపాటు జర్నలిస్టులకు మధ్యాహ్న భోజనం, టీ స్నాక్స్ అందించడం జరిగింది.కార్యక్రమం అనంతరం జర్నలిస్టులకు ప్రెస్ అకాడమీ చైర్మన్ సర్టిఫికెట్లు బ్యాగులను అందించారు. అనంతరం జిల్లాలోని వివిధ పత్రిక సంఘాల నాయకులు ప్రెస్ అకాడమీ చైర్మన్ గారిని సన్మానించారు. ఈ కార్యక్ర మంలో ప్రోఫెసర్ గంటల చక్రపాణి, సీనియర్ జర్నలిస్టులు, జిల్లా మీడియా ప్రతినిధులు ఇతరులు పాల్గొన్నారు.