Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్
నవతెలంగాణ-సుబేదారి
బహుజనుల పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్న 313 వ వర్ధంతి కార్యక్రమంను కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సర్వాయి పాపన్న గౌడ్ చిత్ర పటానికి జడ్పీ చైర్మన్, కూడా చైర్మన్ కుల సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న కిలాషాపూర్ కోటను కేంద్రంగా చేసుకొని నాటి మొగల్ రాజుల అరాచకాలపై దండెత్తిన మహావీరుడని కొనియాడారు. పాపన్న ధైర్యం, పరాక్ర మానికి ప్రతీక అని, అన్ని వర్గాల ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. ''అన్ని వర్గాలను కలుపుకొని అప్పటి నియంతత్వ, నిరంకుశ శక్తులపై పాపన్న చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం. రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం ద్వారా ఆయనకు తగిన గౌరవం ఇస్తోందని అన్నారు. హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యా రాణి, బీసీ సంక్షేమ అధికారి రాంరెడ్డి, బీసీ సంఘాల నాయకులు, తాళ్లపల్లి రామస్వామిగౌడ్, పులి సారంగఫణి గౌడ్, గౌని సాంబయ్య గౌడ్, వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, చిర్ర రాజు గౌడ్, బోనాగని యదాగిరి గౌడ్, జనాగం శ్రీనివాస్ గౌడ్, శ్రీపతి గోపి గౌడ్, తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, సురేష్ గౌడ్, పులి శ్రీనివాస్ గౌడ్, మార్క రవి గౌడ్, బట్టి శ్యామ్ యాదవ్ట్ తదితరులు పాల్గొన్నారు.