Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎస్ లక్ష్మణ్
నవతెలంగాణ - ములుగు
బహుజన ముద్దుబిడ్డ సర్వాయి సర్దార్ పాపన్న అని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఎస్ లక్ష్మణ్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్దంతిని పుర స్కరించుకొని సంక్షేమ భవన్లో ములుగు జిల్లా వెనుకబడిన తరగతుల అభివద్ధి శాఖ అధ్వర్యంలో ఆదివారం పాపన్న గౌడ్ వర్దంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మన్ మాట్లాడారు. అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి అతని దైర్య సాహసాలతో చిన్న మిత్ర గణంతో మొగలు సమ్రాజాన్నే ఎదిరించి గోల్కొండ కోట పై బహుజన జెండా ఎగర వేసి 7 నెలలు పాలించిన తొలి తరం బహుజన బిడ్డ అని కొనియాడారు. సర్వాయి పాపన్న ములుగు జిల్లా అధ్యక్షులు గుండబోయిన బిక్షపతి గౌడ్,తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘ నాయకులు గుండె బోయిన రవి గౌడ్, గౌడ సంఘ నాయకులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్ , జిల్లా గౌడ్ యూత్ ఉపాధ్యక్షులు రంజిత్ గౌడ్, జిల్లా జాక్ ఉపాధ్యక్షులు ఓడ రాజు గౌడ్ ఇతర గౌడ, బిసి కార్యాలయ సిబ్బంది, సంక్షేమ భవన కార్యాలయ సిబ్బంది బిసి వెల్ఫేర్ శాఖా ఉద్యోగులు సరిత, జీవన్ విజరు కుమార్, కె.ఐలయ్య, గోపాల్చారి పాల్గొన్నారు.