Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ములుగు
ములుగు జిల్లా కేంద్రం లోని అంబేద్కర్ సెంటర్ లో కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం 313 వ వర్ధంతి కార్యక్రమం కేజీకేఎస్ జిల్లా కమిటీ సభ్యులు గుండెబోయిన శ్రీహరి గౌడ్ అధ్యక్షతన జరిగింది. సీనియర్ న్యాయవాది, కేజీకేఎస్ నాయకులు తీగల జీవన్ గౌడ్ హాజరై మాట్లాడారు. వెట్టి చాకిరీకీ వ్యతిరేకంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజన వాదులందరిని ఏకం చేసి 12 మంది తో సైన్యం ఏర్పాటు గోల్కొండ కోటపై జెండా ఎగురావేసిన వీరుడు సర్వాయి పాపన్న అన్నారు. అనేక సంవత్సరాల నుండి కెజికెఎస్ ఇతర గౌడ సంఘాలుచేసిన పోరాటల ఫలితంగా ప్రభుత్వం ఇప్పటి కైనా వర్ధంతి సభలు అధికారికంగా జరపడం అభినందనీయం అన్నారు. ప్రభు త్వం ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలను ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు. కార్మిక సంఘం నాయకులు బొమ్మగాని సదానందం గౌడ్ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెబోయిన రవిగౌడ్, రేలా విజరు పైడిమల్ల భారత్ గౌడ్, అలాగే సర్వపూర్ అంబేద్కర్ సెంటర్ లో కూడ జరిగిన కెజికెయస్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని గీత పారిశ్రామిక సంఘాల్లో వర్ధంతి సభలు జరిగాయి.
గోవిందరావుపేట : శ్రమజీవుల శ్రామిక రాజ్య స్థాపనె సర్దార్ సర్వాయి పాపన్నకు మనమిచ్చే నిజమైన నివాళి అని కల్లుగీతా కార్మిక సంఘం ములుగు జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం మండలంలోని పసర గ్రామంలో రాంపూర్ తాళ్ళ మండువ తాటి వనంలో కంఠమే శ్వర ఆలయం వద్ద సర్దార్ సర్వాయి పాపన్న 313 వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. ఒక సామాన్యమైన కల్లుగీత కార్మిక కుటుంబంలో పుట్టిన పాపన్న తన మిత్రులతో కలిసి సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి రాజ్య స్థాపన చేశాడన్నారు. పాపన్న స్ఫూర్తితో నేటితరం పనిచేయాలని అన్నారు. సర్దార్ సార్వాయి పాపన్నస్ఫూర్తితో బహుజన రాజ్యం సాధించడమే సర్వాయి పాపన్నకు నిజమైన నివాళి అన్నారు. కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, జిల్లా యాత్ కన్వీనర్ జక్కు రణదీప్ గౌడ్, బొమ్మగోని షణ్ముఖ్ గౌడ్, పంజాల ఉదరు కుమార్ గౌడ్, బొమ్మగోని చరణ్ తేజ్ గౌడ్, జక్కు బిక్షపతిగౌడ్ జక్కు మొగిలి గౌడ్, బొమ్మగోని జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.
తాడ్వాయి : మండలంలోని కాటాపూర్ తాటి వనంలో ని కంఠమహేశ్వరుడు ఎల్లమ్మ ఆలయం వద్ద తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు పులి చిన్న నరసయ్య గౌడ్, ముస్తాధరు గడ్డం శ్రీధర్ అధ్యక్షతన సర్దార్ సర్వాయి పాపన్న 313 వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతిని ప్రతి జిల్లా కేంద్రంలో జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మెమోను జారీ చేయడం పట్ల హర్షం ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ కలుగీత కార్మిక సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు పులిచిన నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ శ్రమజీవుల రాజ్యం సాధించడమే పాపన్నకు నిజమైన నివాళి అన్నారు. నేడు అధికారం సంపన్నుల చేతుల్లోకి వెళ్లిపో యిందని, దానిని కష్టించి పని చేసే శ్రమజీవులు లాక్కొని శ్రామిక రాజ్యం స్థాపించడమే సర్దార్ సర్వాయి పాపన్నకు నిజమైన నివాళి అని తెలిపారు. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ములుగు జిల్లా సభ్యుడు పాలకుర్తి రవీందర్, గీతా కార్మిక నాయకులు రంగు సత్యనారాయణ, పాలకుర్తి బాబు, రంగు లాలయ్య, పులి రాజు, లింగాల వెంకన్న, ముంజ ప్రదీప్, ఊరుకొండ స్వామి, రంగు సదయ్య, బెల్లంకొండ నాగేష్, తమ్మల సదానందం, తదితరులు పాల్గొన్నారు.
గణపురం : మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న 313 వ వర్ధంతి వేడుకలను అదివారం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్, ఎంపిటిసి మోటపోతుల శివశంకర్ గౌడ్, మోటపొతుల చందర్ గౌడ్, అధ్యక్షుడు మామిళ్ళ వెంకన్న గౌడ్ మార్క కుమార్ గౌడ పాల్గొన్నారు
కాటారం : బహుజన చక్రవర్తి, బడుగు జీవుల ఆశాజ్యోతి, తెలంగాణ అస్తిత్వ పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న 313 వ వర్ధంతి వేడుకలు కాటారం మండలంలోని ధన్వాడ గ్రామంలో కల్లుగీత గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు అరిగెల వెంకట్ రాజం గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు వెంకట రాజం గౌడ్ మాట్లాడారు. గౌడ సంఘం జిల్లా నాయకులు తిరుపతి గౌడ్, రాయలింగు గౌడు, రవీందర్ గౌడ్, అంజయ్యగౌడ్, లక్ష్మయ్యగౌడ్ పాల్గొన్నారు.
హసన్‌పర్తి : సర్దార్ పాపన్న గౌడ్ ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకొని గౌడ సంక్షేమానికి పాటు పడాలని జైగౌడ్ ఉద్యమ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కూనూరు రాకేష్‌గౌడ్ అన్నారు. మండలంలోని సిద్దాపూర్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని పురస్కరించుకొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాకేష్ గౌడ్ మాట్లాడుతూ చరిత్ర ప్రపంచ సుప్రసిద్దిగాంచిన లండన్‌లో ఉన్న కేంబ్రిడ్జీ యునివర్సిటీ పాపన్న చరిత్రపై అధ్యయనం చేయించి పుస్తకాలు ముద్రించిందన్నారు. బ్రిటీష్ ప్రభుత్వం లండన్ లోని విక్టోరియా అండ్ అల్బర్ట్ మ్షుజియంలో సర్దార్ పాపన్న మహారాజ్ శాశ్వత శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భారత స్వాతంత్య్రం వచ్చాక భారత మాత కోసం ప్రాణాలర్పించిన పాపన్న మహా రాజ్ చరిత్రని భరత చరిత్రకెక్కించకుండా తొక్కి వేయడాన్ని ఖండిస్తున్నా మన్నారు. ప్రభుత్వం పాపన్న చరిత్రను చదువుకునేల సీబీఎస్ఇ పాఠ్యాంశంగా చేర్చాలని డిమాండ్ చేశారు. పాపన్న చిత్రపటాన్ని పార్లమెంటులో పెట్టాలన్నారు. వెంకటేష్ గౌడ్, వినరు గౌడ్, అన్వేష్ గౌడ్ పాల్గొన్నారు.
శాయంపేట : మండలంలోని పెద్దకోడేపాక గ్రామంలో దళిత బహుజన విప్లవ వీరుడు, తెలంగాణలో తొలి బహుజన రాజ్య స్థాపకుడు, మొగల్ పాలకుల గుండెల్లో సింహస్వప్నం సర్దార్ పాపన్న వర్ధంతి వేడుకలను ఆదివారం గౌడ కులస్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. బుర్ర విజరు గౌడ్, తడుక నాగరాజు, సాంబయ్య, గట్టు దేవేందర్, కుమారస్వామి, శంకరయ్య, బొల్లపల్లి బిక్షపతి, పోశాల జంపయ్య పాల్గొన్నారు.