Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ములుగు
తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన నడు స్తుందని బిజెపి రాష్ట్ర వ్యవహారాల సహాయ ఇంచార్జ్ సునీల్ బన్సల్ అన్నారు. బీజేఈపీ బూత్ స్థాయి కార్యకర్త నుంచి ప్రధానమంత్రి వరకు ఎవరైనా ఏ పదవికైన అర్హులేనని అన్నారు. ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలోని పార్టీ బూత్ సభ్యుల సమ్మేళనంలో రాష్ట్ర చీఫ్ బండి సంజరుతో కలిసి సునీల్ బన్సల్ పాల్గొన్నారు. ముందుగా మల్లంపల్లిలో బీజేవైఎం జిల్లా ఉపా ధ్యక్షుడు కత్తి హరీష్గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ను బండి సంజరు ఆవిష్కరించారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రంలోని శాంతి స్థూపం నుండి లీలా గార్డెన్ వరకు భారీ ర్యాలి నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ బన్సల్ మాట్లాడుతూ రాష్ట్రంలో 324 బూత్ కమిటీలు బూత్ సమ్మెళ్లనం లు నిర్వహించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కెసిఆర్ లూటీ చేయడా నికేనా అని ప్రశ్నిం చారు. రాబోవు రోజుల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజరు లతో కలిసి మోడీని కలిసి రెయాన్ ఫ్యాక్టరిని తెరిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం బండి సంజ రు మాట్లాడుతూ ములుగు జిల్లాగా ప్రకటించిన కేసీఆర్ జిల్లాలో బస్ డిపో లేదు, ములుగు ను మున్సిపాలిటీగా చేయలేదన్నారు. గిరిజన యూని వర్సిటీకి స్థలం కేటాయించలేదని, గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని పోరాటం చేస్తున్న గిరిజనులకు తన్ని తరిమి జైలు పాలు చేశారని అన్నారు. పేపర్ లీకేజ్ ద్వారా యువకుల భవిష్యత్తును అం ధకారం చేశారన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే దానికి కొమ్ము కాసే ఎంఐఎం ఓల్డ్ సిటీని ఎందుకు అభివృద్ధి చేస్తలేదన్నారు. బిజెపి నాయకత్వంలో ఓల్డ్ సిటీ న్యూ సిటీగా అభివృద్ధి చేస్తామని అన్నా రు. తమ పార్టీ రాష్ట్రంలో స్వతంత్రంగా పోటీ చే స్తుందని, కార్యకర్తలందరూ కష్టపడి గెలి పించుకోవాలని అన్నారు. రాష్ట్రంలో రుణమాఫీ చే యాలని రైతులు ఎదురు చూస్తుంటే పంజాబ్ లో రైతులకు కెసిఆర్ చెక్కులు ఇచ్చాడని అన్నారు. బీజేపీ మాజీ ఎంపీ గరికపాటి మోహన్రావు, బిజెపి జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి, పాలసీ అండ్ రీసెర్చ్ కన్వీనర్ భూక్యా రాజు నాయక్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి అజ్మీరా కృష్ణవేణి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నగర రమేష్, గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ, భూక్య జవహర్లాల్, పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ తక్కలపల్లి దేవేందర్ రావు, అసెంబ్లీ కన్వీనర్ సిరికొండ బలరాం.