Authorization
Sun February 23, 2025 02:52:57 am
- వరల్డ్ పద్మశాలి క్లబ్ అధ్యక్షులు రామ శ్రీనివాస్
నవతెలంగాణ - శాయంపేట
ప్రజలకు వేసవిలో దాహార్తి తీర్చడానికి చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని వరల్డ్ పద్మశాలి క్లబ్ అధ్యక్షులు రామ శ్రీనివాస్, స్థానిక ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు అన్నారు. శాయంపేట మాజీ ఎంపీపీ, ఎంపిటిసి బాసాని చంద్రప్రకాష్ తన తల్లిదండ్రులు కైలాసం, కనకమహాలక్ష్మి, భార్య రమాదేవి స్మారకార్థం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఆదివారం చలివేంద్రం ఏర్పాటు చేయగా వారు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై వీరభద్ర రావు మాట్లాడుతూ చలివేంద్రం ఏర్పాటు చేసిన మాజీ ఎంపీపీ, ఎంపీటీసీ చంద్ర ప్రకాష్ ను అభినందించారు. ప్రతి ఒక్కరూ సమాజసేవకు పాటుపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కందగట్ల రవి, పద్మశాలి సంఘం నాయకులు బి. శరత్ బాబు, కూరపాటి సుదర్శన్, బిట్ల రవి, చందా మల్లయ్య, పోట్టబత్తిని అశోక్, చేనేత సొసైటీ చైర్మన్ మామిడి శంకర్ లింగం, గ్రామస్తులు లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.