Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
మండలంలోని పెద్దతూండ్ల గ్రామంలోని గ్రామపంచాయతిలో అంగన్ వాడి టీచర్లు అన్నపూర్ణ, రజిత,రమ, భారతి ఆధ్వర్యంలో ఆది వారం ఘనంగా పోషణ వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు నిత్యం పోషకాహారం తీసుకోవాలని సూచించారు. పోషణ పక్షంలో భాగంగా అంగన్ వాడి కేంద్రాల్లో చిన్న పిల్లల తల్లులకు, గర్భిణీలకు పోషకాహార ప్రాముఖ్యతపై అవగాహన నిర్వహించారు.చిన్నారులకు హ్యాండ్ వాష్, అక్షరభ్యాసం కార్యక్రమాలు నిర్వహించి, అందరితో ప్రతిజ్ఞ చేయించారు.ప్రభుత్వం అంగన్ వాడి కేంద్రాల ద్వారా చిన్నారులకు, గర్భిణీలకు, బాలింతలకు అందిస్తోన్న పోషకాహారాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడి ఆయాలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.