Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహదేవపూర్
పలిమెల మండలంలోని నీలంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఆమ్లెట్ గ్రామం గెర్రాయిగూడెంలో ఆదవారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం ఎస్సై అరుణ్ ఆధ్వర్యంలో నిర్వహించాఉరు. గ్రామంలో తనిఖీలు నిర్వహించిన అనం తరం గ్రామస్తులతో సమావేశమై ఆయన మాట్లాడారు. మావోయిస్టులకు ఎలాంటి సహాయ సహాకారాలు చేయకూడదని చెప్పడం జరిగింది. మావో యిస్టుల కాలం చెల్లిన విధానాలతో అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని వివరించారు. సామాజిక దురాచారాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే వారిపై చర్యలు ఉంటాయని అన్నారు. సివిల్, స్పెషల్ పార్టీ సిబ్బంది ఉన్నారు.