Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుబేదారి
హనుమకొండ జిల్లా కలెక్ట రేట్ కార్యాలయంలోని కాన్ఫరె న్స్ హాల్లో సోమవారం నిర్వహిం చిన ప్రజావాణిలో వస్తున్న దర ఖాస్తులను జిల్లా కలెక్టర్ సిక్తా ప ట్నాయక్ స్వీకరించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను ఆలస్యం చేయకుండా వెంటనే పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించా రు. ఈ ప్రజావాణిలో జిల్లాలోని వివిధ శాఖలకు సంబంధించి వచ్చిన దరఖాస్తుల ను జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి,డిఆర్డిఎ పీడీ ఆకవరం శ్రీనివా స్కుమార్లు ఈ దరఖాస్తులను తీసుకొని వీటిపై స్పందించి వెంటనే తగు చర్య లు తీసుకోవాల్సిందిగా ఆయా శాఖల అధికారులకు సూచించారు.ఈ ప్రజావాణి లో 92 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారు లు సాంబశివరావు, జగదీశ్వర్, మేన శ్రీను, మాధవి లత, ప్రేమకళా రెడ్డి, వసంత లక్ష్మీ, సత్య నారాయణ రెడ్డి, శ్రీనివాస్, నర్సిరెడ్డి, ప్రభాకర్లు పాల్గొన్నారు.