Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
కేసముద్రం మండలంలోని కోరుకొండపల్లి గ్రామంలో ప్రజల వద్దకు ఆర్టీసీ సేవలు కార్యక్రమం మహబూబాబాద్ టీఎస్ ఆర్టీసీ డిఎం విజరు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ప్ర యాణం సురక్షితమైనదని, సుశిక్షితులైన డ్రైవర్లచే బస్సులు నడుపుతున్నామని, త ద్వారా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని అన్నారు. ప్రైవేట్ వాహ నాలలో ప్రయాణం చేస్తే అసౌకర్యంగా, ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని చె ప్పారు. ఆర్టీసీ బస్సు ప్రజలందరి బస్సు అని ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగెల్లి జ్యోతి శ్రీనవాస్ మా ట్లాడుతూ కోరుకొండ పల్లి గ్రామం మీదుగా కొత్తగా హైదరాబాదుకు ఒక బస్సు , వేములవాడకు గతంలో నడిపిన బస్సు పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్వైజర్ అజీముద్దిన్, సేఫ్టీ వార్డెన్ నరసయ్య, మూల భూలోక రెడ్డి, పనికెర కొమురయ్య, గుండెల కొమురయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.