Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
తమ సమస్యలు పరిష్క రించాలని లేని యెడల ఈ నెల 16 వరకు ఆన్లైన్, ఆఫ్లైన్ పనులు బంద్ చేయడంతో పాటు 17 నుండి నిరవధిక సమ్మె చేయనున్నట్లు మండల ఐకెపి వివోఏలు మం గళవారం స్థానిక ఏపిఎంకు సమ్మె నోటీసు అందజేశారు. ఐకెపి వివోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలని, రోజు రోజుకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విఓఏలకు కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని, వివో ఏలకు ప్రతి నెల రెగ్యులర్గా వేతనాలు వ్యక్తిగత ఖాతా ద్వారా చెల్లించాలని డి మాండ్ చేశారు. అర్హులైన విఓఏలను సిసిలుగా, ఎపిఎంలుగా ప్రమోషన్లు కల్పిం చాలని, విఓఏలకు సెర్ప్ నుండి ఐడి కార్డులు ఇవ్వాలని అన్నారు. ప్రతి విఓఏకి 10 లక్షల రూపాయల భీమా సౌకర్యం కల్పించాలని, మరణించిన విఓఏ కుటుం బానికి 20 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, విఓఏ లపై అధికారు ల వేధింపులు అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. సమ్మె నోటీసు అందజేసిన వారి లో వసంత, స్రవంతి, లక్ష్మి, ఉపేంద్ర, సరస్వతి, సుజాత, మంజుల, శ్రీదేవి, కుమా రి, సునిత, పార్వతీ, లలిత, హేమలత, సతీష్, శ్రీను, కిషన్ పాల్గొన్నారు.