Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
పేపర్ లీకేజీలు బీజేపీ పనే అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హనుమకొండ ఆర్అండ్బి గెస్ట్ హౌస్లో సమావేశం నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొని మాట్లాడుతూ.. పోలీసుల కథనం ప్రకారం పేపర్ లీకేజీ కేసులో ఏ1గా ఉన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజరు, ఏ2గా ఉన్న ప్రశాంత్ పథకం ప్రకారమే పేపర్ల లీకేజీలు చేశారన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం, బండి సంజరు విద్యార్థులు, నిరుద్యోగులు, వారి తల్లిదండ్రుల జీవితాలతో చెలగాటం ఆడారన్నారు. బండి సంజరు నిజా యితీ పరుడైతే పోలీసులకు ఫోన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బండి సంజరు ఫోన్ మాటలు బయటపడితే, లీకేజీలలో కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రమేయం బట్టబయలు అవుతుందని, పథకం ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం పై కుట్ర జరుగుతున్నది అన్నారు. పేపర్ల లీకేజీల కుట్రలో ఒక రాజకీయ పార్టీ ప్రమేయం ఉండడం దురదృష్టకరం అన్నారు ఈ పేపర్ లీకేజీ లో బీజేపీ అధ్యక్షుడు ఆ పార్టీకి చెందిన సంస్థల సభ్యులు ఉండటం అత్యంత హేయం అన్నారు. పేపర్ లీకులతో రాష్ట్రంలో బీజేపీ అరాచకాలు సష్టిస్తున్న దన్నారు. ఈ కుట్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉండటం విచారకరం అన్నారు .ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్ర పన్నుతున్నదన్నారు. పథకం ప్రకారమే ప్రశ్నపత్రాలను లీక్ చేస్తున్నారన్నారని, ఈ నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై నెడు తున్నారని అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు బీజేపీ ట్రాప్లో పడొద్దని విజ్ఞప్తి చేశారు. ఒక పద్ధతి ప్రకారమే ఈ లీకేజీలు జరుగుతున్నాయని, తాజా లీకేజీని బట్టి మరోసారి తేటతెల్లమైందని అన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలకు సీఎం కేసీఆర్ భయపడరని అన్నారు. ఇలాంటి ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, రాజకీయా లను తట్టుకొని చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్, ఇప్పుడు తెలంగాణను తెర్లు కానివ్వరని అన్నారు. రాష్ట్రాన్ని, ప్రజలను, ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలో తమకు బాగా తెలుసని అన్నారు. ఒకప్పుడు తెలంగాణ ప్రభు త్వాన్ని కూల్చే కుట్ర జరిగిందని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరిగిందని అన్నారు. సీఎం కేసీఆర్ కుట్రను పసి కట్టి చేదించారన్నారు. శ్రీరామ నవమి రోజు మత చిచ్చులు పెట్టి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరిగిం దన్నారు. వరుసగా జరుగుతున్న ఈ కుట్రలన్నింటినీ సీఎం కేసీఆర్ చూస్తున్నారని, తెలంగాణను తెచ్చిన సీఎం కేసీఆర్, తెలంగాణను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తారని అన్నారు. తాము కూడా ఆయన వెంట ఉన్నామని ప్రజలం తా తమ వెంటే ఉన్నారన్నారని అన్నారు. పాలన ఎలా చేసుకోవాలో మాకు తెలుసన్నారు. పరీక్షలు ఎలా నిర్వహిం చుకోవాలో, పిల్లలకు ఉద్యోగాలు ఎలా ఇచ్చుకోవాలో కూడా తమకు తెలుసన్నారు. బీజేపీ ఉద్యోగాలు ఇవ్వదని, కానీ ఉద్యోగాలు ఇస్తున్న తెలంగాణకు మోకాళడ్డుతోందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విభజన హామీలు నెరవేర్చలేదని, నిధులు ఇవ్వలేదని, కానీ, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని అడ్డుకుంటుందన్నారు. ఇదంతా చూస్తూ ఊరుకోడానికి తామేమి చేతులు ముడుచుకొని కూర్చోలేద న్నారు. తెలంగాణ పోలీసులు సమర్థులని, ఇలాంటి సమస్యలు తేల్చేస్తారని హెచ్చరించారు.