Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హనుమకొండ,వరంగల్ జిల్లాల
- ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ
నవతెలంగాణ-సుబేదారి
పదవ తరగతి వార్షిక పరీక్షలలో హిందీ పేపర్ లీకేజీ కి భాద్యులుగా చేస్తూ సబియా మదాహత్ అనే ఉపాధ్యాయురాలిని ఉద్యోగం నుండి తొలగించడం సరికాదని, ఆ నిర్ణయాన్ని వెంటనే పునఃపరిశీలన చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ హనుమకొండ, వరంగల్ జిల్లాల కమిటీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. బుధవారం సుబే దారి ఉన్నత పాఠశాలలో జిల్లాల స్టీరింగ్ కమిటీ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యుఎసపిసి రాష్ట్ర, జిల్లా బాధ్యులు పాల్గొని మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లాల కమలాపూర్ మండల కేంద్రంలోని పదవతరగతి పరీక్ష సెంటర్ నుండి హిందీ పేపర్ లీక్ కావడంలో ఇన్విజిలేటర్ ప్రమేయం లేదని, అది ముందసు పథకం ప్రకారం జరిగిందన్నారు. కిటికీ సమీపంలో కూర్చున్న విద్యార్థి, ఇన్విజిలేటర్ తన పనిలో నిమగమై ఉన్న సమయంలో అదును చూసి బయటి వ్యక్తికి సహ కరించడం వల్ల ఇది జరిగిందన్నారు. బయటి నుండి ఓ వ్యక్తి చెట్టు ఎక్కి, గోడ దూకి మొదటి అంతస్తులో ఉన్న తరగతి గది కిటికీ వద్దకు చేరుకొని రహస్యంగా పేపర్ని ఫోటో తీసి వాట్సప్ ద్వారా ఇతరులకు చేర వేయడం భద్రతా వైఫల్యం తప్ప మరొకటి కాదన్నా రు. ఇన్విజిలేటర్ ఏమరుపాటుగా ఉన్నారని భావిం చినా ఆ పొరపాటుకు ఉద్యోగం నుండి తొలగించడం వంటి పెద్ద శిక్ష విధించడం సరికాదన్నారు. సాధారణంగా ఇన్విజిలేటర్ లు పరీక్ష ప్రారంభమైన మొదటి అర్థగంట విద్యార్థుల వివరాలు,సంతకాలు సరిగా ఉన్నాయా అని పరిశీలిస్తూ వారు కూడా ఓఎంఆర్ షీట్ లపై సంతకాలు చేసే పనిలో నిమగమై ఉంటారన్నారు. ఇదే సమయాన్ని అదునుగా చూసి సదరు విద్యార్థి పేపర్ లీక్ కు పాల్పడ్డాడని అన్నారు. ఇది అనుకోకుండా జరిగిన చర్యే తప్పా ఇన్విజిలేటర్ ప్రోద్భలంతో జరిగింది కాదన్నారు. సబియా మదహత్ ను ఉద్యోగం నుండి తొలగించడాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యుఎస్పిసి రాష్ట్ర బాధ్యు లు ఏ శ్రీనివాసరెడ్డి, కే సోమశేఖర్, కే భోగేశ్వర్, జిల్లా బాధ్యులు పెండెం రాజు, కే శ్రీనివాస్ ఎం.రఘుపతి, బి వెంకటరెడ్డి, ఏ గోవిందరావు, టి సుదర్శనం, ఏ సంజీవరెడ్డి, ఉప్పలయ్య, ప మనోజ్, డి రాజమౌళి, ఎం బలకుమార్, టి కుమార్, సుజన్ ప్రసాద్, ఆర్ రాంరెడ్డి, నరదింహ, రఘువీర్, మల్లిక్ పాల్గొన్నారు.