Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల గణపతి
- మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన
నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లి క్రిష్ణ కాలనీలో నీటి సమస్యను పరిష్కరించాలని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ , బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల గణపతి డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు కృష్ణ కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. కాగా వారికి గణపతి సంఘీభావం ప్రకటించి మాట్లా డుతూ నీటి సమస్య ఉందని గత పదిహేను రోజులు గా పాలకుల దృష్టికి తీసుకువచ్చిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీంతో ఖాళీ బిందెలతో నిరసన తెలిపినట్టు వివరించారు. ఎన్నికల సమ యంలో ఇంటికి ఇంటికి గోదావరి జలాలు నల్లా తిప్పితే నీళ్ళే అని చెప్పి అధికారం లోకి వచ్చి ఏండ్లు గడచినా తాగునీటి కోసం ఇతర అవసరాల కోసం బిందెలు పట్టుకుని రోడ్డు మీద నిలుచునే పరిస్థితే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 15 నిమిషాలు కూడా నీళ్ళు ఇవ్వడం లేదని, అది కూడా రోజు విడిచి రోజు ఎదురు చూడాల్సి వస్తుందని అన్నారు. సింగరేణి,మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. నీళ్లు రావడం లేదని అధికారులను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని వాపో యారు. సింగరేణి మున్సిపల్ ఒకరిపై ఒకరు ఆరోప ణలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. మున్సిపల్ బోరు నీళ్ళు ప్రయివేటు కాంట్రా క్టర్లకు అమ్ముకునే శ్రద్ధ ప్రజల అవసరాల మీద ఎందుకు లేదని అన్నారు. ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. వేసవి తరుణంలో ముందస్తు చర్యలు తీసుకునే కనీస అవగాహన కూడా లేదా అని ఎద్దేవా చేశారు. కాలనీ ప్రజలు ఇంటికి 10 వేల రూపాయలు వేసుకుని బోర్లు వేసుకుంటుంటే నాయ కులు అధికారులు ఎందుకు ఉన్నట్టు అని ప్రశ్నిం చారు. మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి బోర్లు వేస్తున్నామని చెప్పి లక్షలాది రూపాయలు కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపిం చారు. వారం రోజుల్లో కృష్ణ కాలనీలో నీటి సమస్య పరిష్కరించకుంటే కాళీ బిందెలతో ఎమ్మెల్యే కార్యా లయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మందల రఘునాథ్ రెడ్డి, నాంపల్లి కుమార్, కాలనీవాసులు కమల , సులోచన, లక్ష్మి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.