Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం జిల్లా కార్యదర్శి శెట్టి వెంకన్న
నవతెలంగాణ-మహబూబాబాద్
భూస్వామ్య వ్యవస్థను రద్దు దున్నే వానికి భూమి దక్కా లని నినాదంతో గ్రామీణపేదలను అఖిల భారత కిసాన్ సభ ఐక్యం చేసిందని రైతు సంఘం జిల్లా కార్యదర్శి శెట్టి వెంకన్న అన్నారు. మంగళవారం తెలంగాణ రైతు సంఘం మహబూ బాద్ జిల్లా కార్యాలయం ముందు జిల్లా ఆధ్యక్షులు గునిగంటి రాజన్న కిసాన్ సభ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రైతు సంఘం జిల్లా కార్యదర్శి శెట్టివెంకన్న మాట్లాడారు. దున్నేవాడికే భూమి, ఆంగ్లేయులు భారతదేశాన్ని విడిచి వెళ్లా లనే నినాదంతో 1936 ఏప్రిల్ 11న స్వాతంత్రోద్యమంలో భాగంగా అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెఎస్) ఏర్పడిందని అన్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు,ఇతరగ్రామీణ పేద ల్ని సంఘటిత పరిచిందన్నారు. భూస్వామ్య విధానాన్ని సమూలంగా రద్దు చేయడం, దున్నేవానికి భూమి ఇవ్వడం, పేద రైతులు, వ్యవసాయ కార్మికుల ఐక్యత పునాదిగా రైతాం గాన్ని ఐక్యపర్చిందని వెంకన్న అన్నారు. రైతు సమస్యలపై ఆందోళనలు నిర్వహించడం, ఇతర వర్గాల పోరాటాలకు సం ఘీభావం తెలియజేసిందన్నారు. మార్కెట్ గుత్తాధిపత్యంతో సాగే దోపిడీని ఎదిరించిందన్నారు. వ్యవసాయంలో విదేశీ కంపెనీల చొరబాటును తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. భూ సంస్కరణలను అమలు జరపాలని జరిగిన పోరాటంలో 19 68లో మొదటిసారి, 1973లో రెండవసారి భూ సంస్కరణ లు జరిగాయన్నారు. ఫలితంగా 64.96 లక్షల ఎకరాలు స్వా ధీనం చేసుకొని 54.02 లక్షల ఎకరాలు పంపిణీ దేశవ్యా ప్తంగా జరిగాయన్నారు. ప్రస్తుతం కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలను ఢిల్లీలో రైతాంగ పోరాటం ఫలితంగా ఉపసంహరించబడ్డాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం, కనీస మద్దతు ధరల చట్టం, రుణ విమోచన చట్టం కోసం మరో పోరాటానికి సిద్దం కావా లని రైతాంగానికి పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో రైతు లు ప్రజాసంఘాలనాయకులు బాణోత్ కిరణ్, తోట శ్రీను, కుమ్మరికుంట్ల నాగన్న, గవిని వెంకన్న, చిపిరియాకయ్య, య మగాని వెంకన్న, రాములు, మచ్చ వెంకన్న పాల్గొన్నారు.
కేసముద్రం రూరల్ : భారత దేశ వ్యాప్తంగా కేంద్ర ప్ర భుత్వం అవలంభిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలపై ఆల్ ఇండియా కిసాన్ సభ నిర్వహించిన పోరాట పాత్ర అద్వితీ యమని మార్తినేని పాపారావు అన్నారు. మంగళవారం కేస ముద్రం మండల కేంద్రంలో మండల కమిటీ ఆధ్వర్యంలో ఏఐకేఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రైతు సంఘం మహబూబాద్ జిల్లా కార్యదర్శి మార్తినేని పాపారావు పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి పాపారావు మాట్లాడుతూ మనువాద భావాజాలం తో దేశాన్ని పాలిస్తున్న కేంద్ర పాలకులు, రైతుల పట్ల రైతాం గ అభివృద్ధి పట్ల అవలంభిస్తున్న విధానాలపై సమర్శిల పోరాటాలు మార్గదర్శి ఏఐకేఎస్ అని ఆంగ్లేయుల పాలనలో రైతాంగ సమస్యల పరిష్కారం కొరకు సహాజాను, సరస్వతి, ఈఎంఎస్ నంబూద్రపాద్, ఎన్.పుచ్చలపల్లి సుందరయ్య లాంటి ఉద్దండుల నేతృత్వంలో పురుడు పోసుకొని గోవా రై తాంగ ఉద్యమానికి తలమానికం అవలంభించిన ఆస్పూర్తితో భవిష్యత్తులో రైతాంగ పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు మోడెం వెంకటేశ్వర్లు, చా గంటి కిషన్, కోడిశాల వెంకన్న, జల్లె జయరాజ్, నీరుటి జలంధర్, నేరేడు పద్మ, ఎండి పాషా పాల్గొన్నారు.
గార్ల : ఆఖిల భారత కిషన్ సభ (ఎఐకేఎస్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రైతు సంఘం పిలుపు మేరకు సంఘం జిల్లా నాయకులు భాగం లోకేశ్వరావు జెం డాను ఎగురవేసి మాట్లాడారు. దున్నే వాడికి భూమి, ఆంగ్లే యులు భారతదేశాన్ని విడిచి వెళ్లాలనే నినాదంతో స్వాతం త్య్ర ఉద్యమంలో భాగంగా 1936లో ఏర్పడిన రైతు సంఘం రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర గ్రామీణ పేదలను సంఘటిత పరచి అనేక పోరాటాలకు నాయకత్వం వహిం చిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కందు నూరి మహేశ్వరావు, నాయకులు సింగం వెంకటేశ్వర్లు, సిహెచ్.ఎల్లయ్య, సురేష్, రైతులు పాల్గొన్నారు.
బయ్యారం : అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భావ దినో త్సవం సందర్భంగా మండల రైతు సంఘం ఆధ్వర్యంలో సం ఘం మండల కార్యదర్శి మంకెన తిరుపతిరావు జెండా ఎగు ర వేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నంబూరి మధు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలను రద్దు పరిచినట్లే పరిచి దొంగ చాటుగా వాటిని అమలు చేయాలని చూస్తున్నారని, రైతుల మోటార్లకు మీటర్ల బిగించి రైతుల మీద అధిక భారం పడేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని దీనిని తక్షణమే విరమించుకోవాలన్నారు. స్వామినాథన్ కమిషన్ అమలు చే యాలని,అన్నిపంటలకు గిట్టుబాటు ధరకల్పించాలని డిమాం డ్ చేశారు. బయ్యారం పెద్ద చెరువు కాలువలు ఉపాధి హామీ పనులు పెట్టి రిపేర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్య క్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్రనాయకులు మం డా రాజన్న, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి తుడుసు యాదగిరి, రైతు సంఘం జిల్లా నాయకులు అప్ప య్య, నాయకులు శ్రీను, లక్ష్మీపతి పాల్గొన్నారు.