Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే అరూరి రమేష్
- జోరుగా బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు
నవతెలంగాణ-ఐనవోలు
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేస ీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తు న్న ప్రతీ సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకువెళ్లాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీఆర్ఎస్ పార్టీ వ రంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఐనవోలు మండలం బీఆర్ఎస్పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, హన్మకొండ జిల్లా జెడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ బాబు, ఎమ్మెల్యే అరూరి రమేష్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. తెలంగాణలో సీ ఎం కేసీఆర్ అందించిన సంక్షేమం, చేసిన అభివద్ధే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్ష అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రిఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కేసీ ఆర్ నేతత్వంలో తెలంగాణ దేశంలోనే రోల్‌మాడల్‌గా నిలిచిందని కొనియాడారు. పున్నేల్ క్రాస్ రోడ్డు లోని సత్యంగార్డెన్స్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ శ్రేణులు అతిథులకు డప్పు చప్పుల్లు, కోలా టాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మ హాత్మా జ్యోతిరావు పూలే 197జయంతిని పురస్క రించుకుని అయన చిత్రప టానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పది ఏళ్లక్రితం తెలంగాణ పల్లెలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయో మన కళ్ళ ముందు కనిపిస్తుందని అన్నారు. నడి ఎండ కాలంలో కాలువలలో నిండుగా నీళ్లు ఎప్పుడన్నా పోయినయా. ఇంటింటికి నల్లా నీళ్లు వచ్చినయా ప్రజలుఆలోచించాలని కోరారు. మూడు ఏళ్లలోనే కాళేశ్వరం పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యా మలంచేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
మిషన్ భగీరథపథకం ద్వారా ఇంటింటికి త్రాగు నీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని వెల్లడించారు. అందుకే దేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అ న్నారు. అలాంటి గొప్పవిజన్ ఉన్న నాయకుడు మన కు ముఖ్యమంత్రిగా ఉండడం మన అదష్టం అని తెలి పారు. కేంద్రంలోని బీజేపీ పార్టీ చేస్తున్న నీతిమాలిన రాజకీయాలను తిప్పికొట్టాలనిపిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదెండ్ల కాలంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివద్ధి, సంక్షేమ కార్యక్ర మాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రజల అవసరాలను ముందుగానే గు ర్తించి దానికి అనుగుణంగా సంక్షేమ పధకాలను అ మలు చేస్తున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అన్ని రంగా ల్లో అగ్రగామిగా తీర్చిదిద్దెందుకు శాయశక్తుల కషి చే స్తున్నాని వెల్లడించారు. పార్టీ కోసం నిబద్దతతో పని చేస్తున్న కార్యకర్తల కషి వెలకట్టలేనిదని అన్నారు. ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. ఇతర రాజకీయ పార్టీలు కేవలం ఎన్నికలు, రాజకీయ ప్రయోజనాలకే పకులడుతున్నా యని విమర్శించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు రామాలయం కట్టడానికిచందాలు వసూలు చేశారు. మా నాయకుడు కేసిఆర్ ఒక్క పైసా ఎవరికి అడగ కుండా యాదగిరిగుట్ట దేవాలయాన్ని కట్టారని గుర్తు చేశారు. అన్నిమతాలను గౌరవించే నాయకుడు కెసి ఆర్ అని తెలంగాణ లో గతానికి ప్రస్తుతానికి వ్యత్యా సం చూస్తే అడుగడుగునా కన్పిస్తుంది అని తెలంగా ణ రాష్ట్రానికీ మరోసారి కేసీఆర్ నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, జడ్పీ వైస్ చైర్మన్ శ్రీరాము లు, జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు ఉస్మాన్అలీ, ఎంపీపీ మార్నేనిమధుమతి, వైస్‌ఎంపీపీ తంపుల మోహన్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శంకర్ రెడ్డి, మం డల, గ్రామ ప్రజా ప్రతినిధులు, నాయకులూ, కార్యక ర్తలు తదితరులు పాల్గొన్నారు.