Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ కలెక్టర్ పి.ప్రావీణ్య
నవతెలంగాణ-వరంగల్
మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసిన సా మాజికవేత్త మహాత్మా జ్యోతిరావుపూలే అని కలెక్టర్ ప్రావీణ్యఅన్నారు. జ్యోతిరావుపూలే 197వ జయంతి సందర్బంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, తూర్పు శాసనస భ్యులు నన్నపునేని నరేందర్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోజుల్లో జ్యోతి భా పూలె చేసిన పోరాటాలే నేడు మ హిళలు అన్నిరంగాల్లో అ డుగు పెట్టడానికి దోహ ద పడ్డాయాన్నారు. ఎంద రో మహానుభావులు సమా జంలో రావలసిన మార్పు ల కోసం ఎంతో కృషిచేశా రని వాటన్నింటిని మనం గుర్తు పెట్టుకొని సమాజ భివృద్ధిలో మనవంతు బాధ్యతగా వ్యవహరించాల న్నారు. సమాజంలో సగభాగంగా ఉండే స్త్రీలు కూ డా విద్యావంతులుకావాలని సంకల్పించిదానిని జ్యో తిబాపూలే ఆచరణలో చేసిచూపెట్టారని కలెక్ట ర్ తెలి పారు. ముందు తనభార్యనే పాఠశాలకు పంపి మహి ళలందరూ విద్య నభ్యసించేలా ఆదర్శంగా నిలబడిన మహాత్మా జ్యోతి భాపూలె మనకుస్ఫూర్తిదాయాక మ న్నారు. ఇదేస్ఫూర్తితో మనంకూడా ముందుకు సాగు తూ భవిష్యత్తరాలకు మంచిమెసేజ్ని అందించాల న్నారు. అనంతరం తూర్పు శాసనసభ్యులు నన్నప ునేని నరేందర్ మాట్లాడుతూ బీసీ వర్గాలన్నీ కలిసి మెలిసి ఉంటేనే ఏదైనాసాధ్యమవుతుందన్నారు. ఆ రోజుల్లో వితంతు స్త్రీల కోసం అలాగే స్త్రీ విద్య కో సం పోరాడిన మహాత్మా జ్యోతిభా పూలె నుండి మ నంఎన్నో నేర్చుకోవాలన్నారు. ఆనాడు వివిధ సమ స్యలపైన వాళ్లు చేసిన పోరాటాల ఫలాలనే ఈరోజు మనం అనుభవిస్తున్నామన్నారు. మహానుభావుల ఆ లోచన విధానము, పోరాట స్ఫూర్తి ని మనము పా టించాలన్నారు.అన్నీ కులాల అభివద్ధి కోసం ప్రభు త్వం ఇస్తున్న అవకాశాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమాజంలో విప్లవత్మక మార్పు లు రావాలి అంటే అందరూ ఐక్యతగా ఉంటేనే సా ధ్యమవుతుందని వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లుస్థానిక సంస్థలు అశ్విని తానాజీ వాకాడే, శ్రీవాత్స రెవెన్యూ తదితరులు పాల్గొన్నారు.