Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి
నవతెలంగాణ- ములుగు
మహిళా విద్యకు మార్గదర్శకులు మహాత్మా జ్యోతిబా పూలే అని నేటితరం వారి ఆశయాలను స్పూర్తిగా తీసుకొని మహిళా విద్యకు పెద్ద పీట వేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాల యంలో మహాత్మా జ్యోతి రావు పూలే 197వ జయంతి సం దర్భంగా అదనపు కలెక్టర్ వైవి గణేష్, డీఆర్ఓ రమాదేవితో కలసి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లా డుతూ సామాజిక తత్వవేత్త,ఉద్యమకారుడు, సంఘసేవ కుడు, సమాజ శ్రేయస్సు కోసం, స్త్రీ విద్య అభివద్ధి కోసం అహర్నిశలు తపించిన గొప్ప వ్యక్తి మహాత్మ జ్యోతిబాపూలే అని అన్నారు.
మహాత్మ జ్యోతిబాపూలే జీవితం ఆదర్శనీయం
మహాత్మ జ్యోతిబాపూలే జీవితం ఆదర్శనీయమని జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) వైవి గణేష్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోనీ సంక్షేమ భవన్ లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంధాలయ చైర్మన్ పోరిక గోవింద నాయక్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతితో కలిసి మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మహాత్మ జ్యోతిబాపూలే జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని అన్నారు. జిల్లా గ్రంధాలయ చైర్మన్ గోవిందనాయక్ మాట్లా డుతూ మహనీయులఆలో చనలు ఆచరించాలంటే అంద రూ ఐక్యమత్యంతో ఉండాలని అన్నారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి మాట్లాడుతూ మహిళలు నేడు అన్ని రంగాలలో ముందున్నారంటే దానికి కారణం మహాత్మ జ్యోతిబాపూలే అని కొనియాడారు. జిల్లా వెనుకబడిన తరగ తుల అభివృద్ధిశాఖ అధికారి లక్ష్మణ్, కలెక్టరేట్ కార్యాలయ ఏఓ విజయ భాస్కర్, సూపరిండెంట్లు విశ్వప్రసాద్, రాజ్ ప్రకాష్, రవీందర్, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి, యువజన క్రీడల అధికారి పీవీ రమణాచారి, కుల సంఘాల జేఏసీ అధ్యక్షులు ముంజల బిక్షపతి గౌడ్, బీసీ జాతీయ సంఘం జిల్లా కన్వీనర్ మురళీకష్ణ, బీసీ సంఘం అధికార ప్రతినిధి దొడ్డిపల్లి రఘుపతి, జిల్లా కుమ్మరి సంఘం అధ్యక్షులు ఆషాడపు దేవేందర్, సకల ఉద్యోగుల సంఘం నాయకులు గుల్ల గట్టు సంజీవ పాల్గొన్నారు.
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి పూలే
అంటరానితనం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్పవ్యక్తి జ్యోతి రావుపూలే అని జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో కార్యా లయ సిబ్బంది స్థానిక నాయకులతో కలిసి జ్యోతిరావుపూలే జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. జడ్పీ సీఈఓ ప్రసూన రాణి, డిప్యూటీ సీఈఓ రమాదేవి, బీఆర్ ఎస్ ములుగు మండల, పట్టణ అధ్యక్షుడు బాదం ప్రవీణ్, చెన్న విజరు, శ్రీధర్ వర్మ, హజార్, నగేష్, సుధీర్, రామకృష్ణ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.