Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నవతెలంగాణ-భూపాలపల్లి
ఆధునిక కాలంలో ఆంగ్ల భాష ప్రాముఖ్యత పెరిగిపోతుందని, విద్యార్థు లకు ప్రాథమిక దశ నుంచి ఆంగ్ల భాష పరిజ్ఞానం అత్యంత కీలకమని అది అందే దిశగా పట్టిష్ట చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. మంగళవారం దిశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో భూపాలపల్లి మండ లంలోని కమలాపూర్ ఎంపీపీ పాఠశాలలో నిర్వహించిన ఈఎల్ఎఫ్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. చెన్నైకు చెందిన దిశ ఫౌండేషన్ వారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యార్థులకు ప్రత్యేకంగా ఆంగ్లభాష పరిజ్ఞానం పెంపొందించేందుకు 80 రోజులపాటు ప్రత్యేక శిక్షణ అందించడం ప్రశంసనీయమని అన్నారు. జిల్లాలోని ప్రతి మండలంలో ఒక ప్రాథమిక పాఠశాలను ఎంపిక చేసుకొని ముందస్తుగా 11 ప్రాథమిక పాఠశాలలో ఆంగ్ల భాష పై శిక్షణ పూర్తి చేశామని తెలిపారు. దిశా ఫౌండేషన్ వారి సహకారంతో వచ్చే జూన్ నుంచి జిల్లాలోని మరో 50 ప్రాథమిక పాఠశాలలో ఆంగ్ల భాష, గణిత శాస్త్ర పరిజ్ఞానంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ప్రారంభిస్తామని అన్నారు. హెచ్డీఎఫ్సీ సహకారంతో జిల్లాలోని 20 ప్రాథమిక పాఠశాలలో స్మార్ట్ టివిలు ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో ఉన్న ప్రతి ప్రాథమిక పాఠశాలలో స్మార్ట్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేసే దిశగా వివిధ కార్పొరేట్ సంస్థలతో చర్చలు జరుపు తున్నామని అన్నారు. దిశా ఫౌండేషన్ అందించే ప్రత్యేక శిక్షణ విజయవంతం కావడంలో స్థానిక ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారని అన్నారు. భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన సమయంలో విద్యాశాఖ మంత్రి డిజిటల్ క్లాస్ రూమ్‌ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. ప్రాథమిక విద్యలో మన జిల్లా రాష్ట్రానికి ఆదర్శవంతంగా నిలవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రారంభించిందని, విద్యార్థులకు అందించే పాఠ్యపుస్తకాలు సైతం ఆంగ్లంలో తెలుగులో రెండు భాషల్లో ఉండే విధంగా తయారు చేస్తున్నారని అన్నారు. తొలిమెట్టు కార్యక్రమం ద్వారా ప్రాథ మిక విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం పిల్లలు నేర్చుకున్న ఇంగ్లీష్ పై, స్పీచ్, సాంగ్స్, గీతాలు, తదితర ప్రదర్శన తిలకించి పిల్లలకు సర్టిఫికెట్లు అందచేశారు. ఈ కార్యక్రమంలో దిశా ఫౌండేషన్ ప్రతినిధి ఐశ్వర్య, మంజు, విద్యాశాఖ అధికారులు కిషన్‌రావు, దేవా, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.