Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ అభివద్ధిని చూడలేకనే కుట్ర
- ఉపాధి హామీలో కేంద్రం కోతలు
- రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ-పాలకుర్తి
తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపట్ల జీర్ణించుకోలేని కేంద్ర బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడు తోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. సీఎం కేసీఆర్, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆత్మీయ సమ్మేళనాల్లో భాగంగా మంగళవారం మండలంలోని రెండు ఎంపీటీసీ గ్రామాల పరిధి మల్లంపల్లి, బిఖ్యానాయక్ పెద్ద తండా, హటియ తండా, నారబోయిన గూడెం, వావిలాల కలిపి వావిలాలలో, ముత్తారం, వల్మిడి, సిరిసన్న గూడెం, కంబాలకుంట తండా కలిపి ముత్తారంలో నిర్వహించిన కార్యకర్తలే నా బలం ప్రజలే నా బలగం నినాదంతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఆత్మీయ సమ్మేళనాల ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్రావుతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరై మాటాడారు. తెలంగాణలో 60 ఏండ్లుగా గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి జరగలేదని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో జరుగుతున్న అభివద్ధిని చూడలేకనే కాంగ్రెస్, బీజేపీలు కుట్రలు చేస్తూ దుష్ప్ర చారాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని నీరుగారుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీలో కోతలు పెట్టడంతోపాటు కూలీలను ఇబ్బందులకు గురి చే స్తుందని అన్నారు. చేస్తున్న పనులకు రెండుసార్లు ఫోటోలు తీయడంతో పాటు రెండు పూటలా సంతకాలకు తెరలే పిందని అన్నారు. ఉపాధి హామీని వ్యవసాయ రంగానికి అనుసం ధానం చేయమని కోరినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తుందని అన్నారు. వ్యవసాయ రంగాన్ని ప్రధాని అంబానీలకు అప్పగించేందుకు పార్లమెంటులో బిల్లు ప్రవే శపెట్టిందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర చేస్తుందన్నారు. తెలంగాణ లో అమలవుతున్న అభివద్ధి సంక్షేమ పథకాలు బిజెపి, కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో అమలు కావడం లేదని అన్నారు. తెలంగాణలో అమలు అవుతున్న అభివద్ధి సంక్షేమ పథకాలకు, పంచాయతీరాజ్ శాఖకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తుందే తప్ప నిధులు ఇవ్వడం లేదని విమర్శిం చారు. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకుండా మొండికేయడంతో తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకించాల్సిన కాంగ్రెస్ బీజేపీకి వంత పాడుతుందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ సహకారంతో పాలకుర్తి నియో జకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పాలకుర్తిని పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దేందుకు సీఎం సుముఖంగా ఉన్నారని, టూరిజం ప్యాకేజీ లో పాలకుర్తి, వల్మిడి, బమ్మెర గ్రామాలను పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దు తున్నామని అన్నారు. వల్మిడి ఆలయాన్ని యాదాద్రి తర హాలో, బమ్మెరను బాసర తరహాలో తీర్చి దిద్దేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను బీఆర్ఎస్కు కార్యకర్తలే తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. అంతకుముందు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దంప తులను ప్రజలు ఆటపాటలతో, బతుకమ్మలతో, డప్పు వాయి ద్యాలతో, కోలాటాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్ర మంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, జెడ్పి ఫ్లోర్ లీడర్ కృష్ణ పుస్కూరి శ్రీనివాసరావు, జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎండి మదర్, ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ వీరమనేని యాకాం తరావు, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, బీఆర్ఎస్ మండల నాయకులు దొంతమల్ల గణేష్, వీరమల్ల రాజు, ఆయా గ్రామాల సర్పంచులు గంట పద్మ భాస్కర్, మేడిద రజిత సమ్మన్న, కత్తి సైదులు, మహేందర్, వాలు నాయక్, బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు చింతకింది ఉపేందర్, పంగ సైదులు, ఉప సర్పంచ్‌లు నీరటి సోమయ్య, కూనూరు కృష్ణమూర్తి ఎంపీటీసీలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.