Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభానకి నోచుకోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు
- మధ్య దళారులను ఆశ్రయిస్తున్న రైతులు కల్లాల్లోనే కాంటాలు...
నవతెలంగాణ-పాలకుర్తి
మబ్బులు, అకాల వర్షాలు, ఈదురుగాలుల బెడదలతో బెంబేలెత్తుతున్న రైతన్న రబీలో సాగు చేసుకున్న వరి పంటను కోయడం ప్రారంభించినప్పటికీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. మబ్బుల బెడద రైతన్నను దడ పుట్టిస్తోంది. ఆరుగాలం శ్రమకోడ్చి పండిం చిన వరి పంట ఒక్క గంటలోనే ఆగమవుతుందనుకుంటు న్న రైతన్నలు 10 రోజులుగా వరి కోతలను ప్రారంభిం చారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యానికి మద్దతు ధర కల్పించిన ప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ఇదే అదనుగా మధ్య దళారులు అందిన కాడికి దోచు కుంటూ అరకొర ధరలతో కల్లాల్లోనే కాంటాలు పెడుతు న్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర సుమారు రూ.2000 ఉన్నప్పటికీ మధ్య దళారులు మాత్రం రూ.1550 నుండి రూ.1600 కొనుగోళ్లు చేస్తున్నారు. సాగు చేసిన రైతులు వేల రూపాయల పెట్టుబడులు పెట్టినప్పటికీ వరికి అనేక రకాల తెగుళ్లు రావడంతో వరి పంట కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలో దళారీలు రూ.100 నుండి రూ.200 లాభంతో కొనాల్సి ఉన్నప్పటికీ ఏకంగా రూ.400 నుండి రూ.500 వరకు కోతలు విధించడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వ్యవసాయ మార్కెట్లలో రూ. 1650 నుండి రూ.1750 వరకు మద్దతు ధర ఉన్నప్పటికీ ధాన్యం తరలించేందుకు వాహనాల ఖర్చు రైతులకు భారంగా మారింది. రబీ సీజన్లో జనగామ జిల్లాలోని రైతులు 1,92,000 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సొసైటీలు, ఐకెపిల ఆధ్వర్యంలో 190 నుండి 200 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అయినప్పటికీ నేటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. దీంతో కోసిన ధాన్యాన్ని మధ్య దళారీలు గద్దల్ల తన్నుకు పోతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పంటకు మద్దతు ధర కల్పించడంతోపాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రైతులు వేడుకుంటున్నారు.