Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇదీ పోచాపూర్ మినీ గురుకులం విద్యార్థినిల దుస్థితి...
- ఆడిట్ పేరుతో మూడు రోజులుగా ప్రిన్సిపాల్ గైర్హాజర్
- బావి నుండి నీరు మోసుకొచ్చుకుంటున్న విద్యార్థినిలు
నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలోని బంధాల ఏజెన్సీలో ని పోచాపూర్ లోఉన్న మినీ గురుకులం విద్యార్థినిల పరిస్థితి అగమ్యగోచ రంగా మారింది. ఆడిట్ ఉంద ని సాకుతో ప్రిన్సిపల్ చీమల స్వాతి గత మూడు రోజుల నుండి పోచాపూర్ మినీ గురు కులానికి పోకుండా గైరాజాల్లో ఉంది. మినీ గురుకులంలో కరెంటు లేక బోరు పనిచేయక మంచినీరు లేక విద్యార్థినీ లు నానా ఇబ్బందులు పడుతున్నారు. మినీ గురుకులంలో ఉన్న చిన్న చిన్న ఆదివాసి పిల్లలు బావి వద్దకు పోయి, ఒక వర్కర్ నీళ్ళు తోడు తుంటే, నీళ్ళు తెచ్చుకొని కాలం వెల్లతీసుకుంటు న్నారు. ఆ పాత బావి దాని చుట్టూ చెట్లు విపరీతంగా పెరిగాయి. పాములు తేళ్లు అందులో నివాసాలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. బావి చుట్టూ భూమి గుడి విద్యార్థులు నీళ్లు మోసుకుంటూ చదువుకుం టున్నారు. చిన్నపిల్లలు కాబట్టి బావిలో పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మినీ గురుకులంలో బోరుబావితోపాటు ఒక చేతిపంపు కూడా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. రాత్రి కాగానే విద్యార్థినిలు చీకటిలో నీటి సౌకర్యం లేకుండా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. దీనికి సంబంధించి సంబంధిత అధికారులు, కలెక్టర్ పూర్తిస్థాయిలో పరిశీలించి, మినీ గురుకులం విద్యార్థులకు తగు న్యాయం చేయాలని లింగాల- బంధాల ఏజెన్సీ ఆదివాసి ప్రజలు కోరుతున్నారు.