Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్
- జిల్లా గ్రంథాలయంలో ఘనంగా కవి సమ్మేళనం
నవతెలంగాణ-భూపాలపల్లి
తెలంగాణ రాష్ట్రం కవులకు, కలలకు పుట్టి నిల్లని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం లోని గ్రంధాలయంలో జరిగిన కవి సమ్మేళనంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరును తెలంగాణ సెక్రటేరియట్‌కు పెట్టడం దేశంలో ఎక్కడలేని విధంగా అంబేద్కర్ 125 అడు గుల కాంస్య భారీ విగ్రహాన్ని నిర్మించి ఆవిష్కరి స్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రమంతా గ్రంథా లయ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న కవి సమ్మేళనంలో భాగంగా జయశంకర్ జిల్లాలో కూడా జరుపుకోవడం సంతోషమని అన్నారు. కవులు కళాకారులు, విద్యార్థులు, మేధావులు గ్రంథాలయ పుస్తకాలు వాడుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయి కి ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా గ్రామ గ్రం థాలయంలో చదువుకొని ఆస్కార్ అవార్డు సాధించిన చంద్రబోస్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచిం చారు. జిల్లా కేంద్రంలో నిరుద్యోగ యువత, విద్యా ర్థులు పుస్తక పాఠకులు, కళాకారులు, కవుల కొరకు ఫిబ్రవరి 23న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన జిల్లా గ్రంథాలయ శాశ్వత భవన నిర్మాణానికి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి కోటి రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో తాత్కాలిక గ్రంథాలయం కోసం సహకరిస్తున్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, సింగరేణి జనరల్ మేనేజర్ బళ్ళారి శ్రీనివాసరావుకు ఈ కార్యక్రమానికి బహుమతులు అందిస్తున్న జీఎంఆర్ ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ గౌతం రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ గండ్ర జ్యోతికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ స మ్మేళనంలో కవులు కొలుగూరి సంజీవరావు, దుప్పటి మొగిలి, గడ్డం రమేష్ బాబా సాహెబ్ అంబేద్కర్ పై కవితా పఠనం చేశారు. అనంతరం కవులకు శాలు వాలు, ప్రశంస పత్రం అందజేసి ఘనంగా సత్కరించి మేమేంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథ పాలకులు చంద్రమౌళి, శారద, శ్రీనివాస్ , సిబ్బంది రాకేష్ కవులు, విద్యార్థులు పాల్గొన్నారు.