Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ములుగు
సిపిఎస్ రద్దు కై రాష్ట్ర వ్యాప్త కాన్స్టిట్యూషనల్ మార్చ్ లో భాగంగా ఏప్రిల్ 16 ఉదయం 10 గంటలకు ములుగు జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ నుండి గాంధీ విగ్రహం వరకు జరిగే మార్చ్ లో ప్రతి ఒక్క సీపీఎస్ ఉద్యోగి పాల్గొనాలని ఉద్యోగ సంఘం ములుగు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అన్నవరం రవికాంత్, మంకిడి రవి లు పిలుపు నిచ్చారు. బుదవారం సంక్షేమ భవన్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ర్యాలీని విజయవంతం చేయడం మనందరి బాధ్యత అని అన్నారు. వృద్ధాప్యంలో మన కుటుంబానికి ఆర్థిక భద్రత కోసం బాధ్యతగా ర్యాలీలో పాల్గొనాలని అన్నారు. నీకోసం నీ కుటుంబ సంక్షేమం కోసం టీఎస్సీపీఎస్ఈయూ ఎన్నో వ్యయ, ప్రాయాసలను తట్టుకొని కార్యాచరణ లేదంటు విమర్శించిన వారికి సమాధానం చెప్పాలన్నారు. ఎన్నెన్నో అవమానాలు భరిస్తూ బాధ్యతగా సమయం, సందర్భానుసారంగా తనదైనశైలిలో సరైన సమయంలో సరైన పంథాలో సామూహిక సెలవు, ఆయుత ధర్మ దీక్ష, జనజాతర లాంటి సాహసోపేతమైన కార్యాచరణ రూపొందిస్తూ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్‌ను టీఎస్ సిపిఎస్ఈయూ సాధించి పెట్టిందన్నారు. రాబోయే ఎన్నికల్లోపు పాత పెన్షన్ సాధించాలనే సంకల్పంతో నేడు పెన్షన్ కాన్స్టి ట్యూషనల్ మార్చ్‌కు శ్రీకారం చుట్టిందని అన్నారు. సిపిఎస్ ఉద్యోగిగా ర్యాలీని విజయవంతం చేయడం అందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎస్ ఉద్యోగ సంఘం గౌరవాధ్యక్షులు మడుగురి నాగేశ్వరరావు, తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియే షన్ జిల్లా అధ్యక్షులు గుల్ల గట్టు సంజీవ, ట్రెజరర్ కలాలి మొగిలి, సీపీఎస్ ఉద్యోగ సంఘ నాయకులు వినాయక్, వనజ, పసుల్ల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.